HBD Pawan Kalyan: పవన్ స్టార్ అవ్వడానికి ఆమె కారణం.. అలా చేసిన ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడతను. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తూ దాదాపు ఇరవై ఏళ్లుగా దూసుకెళ్తూనే ఉన్నాడు. సినిమాల పరంగానే కాదు.. ప్రజాసేవలోనూ ఎప్పుడూ ముందుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పవర్ స్టార్. ఇలా రెండు రంగాల్లోనూ తనదైన శైలిని చూపించుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు. ఇక, ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన జీవితంలో జరిగిన కొన్ని మధుర ఘట్టాలను గురించి తెలుసుకుందాం పదండి!

పవన్ కల్యాణ్ కుటుంబం.. చదువు ఇలా

పవన్ కల్యాణ్ కుటుంబం.. చదువు ఇలా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. వీరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, రెండో వారు నాగేంద్ర బాబు. పవన్ కల్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఎక్కడికి ట్రాన్ఫర్ అయితే అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేంది. అందుకే పవన్ చదువు ఒక దగ్గర సాగలేదు. పది వరకు ఎన్నో స్కూళ్లు మారిన పవన్.. ఇంటర్ మాత్రం నెల్లూరులో చదివాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లోమా చేసి ఆపేశాడు.

సినిమాల్లోకి రావడానికి కారణం ఆమెనే

సినిమాల్లోకి రావడానికి కారణం ఆమెనే

ఉన్నత చదువులు చేయడం ఇష్టం లేని పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పుస్తకాలు చదవడం, ఒంటరిగా ఉండడం చేసేవాడు. ఇది గమనించిన వదిన (చిరు భార్య) సురేఖ.. చిరంజీవితో పవన్ గురించి మాట్లాడారట. ఆయనను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకెళ్లమని సూచించారట. పవన్‌ను కూడా ఆమె బలవంతంగా ఒప్పించారని ఆయనే స్వయంగా వెల్లడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఆమె ప్రోద్భలంతోనే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు స్టార్ అవడం వెనుక ఆమె పాత్ర చాలా ఉందనే చెప్పాలి.

మొదటి చిత్రంలోనే అలా చేసి హైలైట్‌గా

మొదటి చిత్రంలోనే అలా చేసి హైలైట్‌గా

సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎలాగోలా ఒప్పుకున్న పవన్ కల్యాణ్.. తన ఎంట్రీ అల్లాటప్పాగా ఉండకూడదని అనుకున్నాడు. అందుకోసం ఎన్నో శిక్షణలు తీసుకున్నాడు. ఆ తర్వాత అంటే 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇందులో తన మార్షల్ ఆర్ట్ సత్తాను చూపించాడు. ఇలా తన 23 ఏళ్ల సినీ కెరీర్‌లో 23 సినిమాల్లో హీరోగా నటించాడు. ఇందులో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అలాగే డిజాస్టర్లు కూడా దక్కాయి. ఇలా హిట్లు ఫ్లాపులు సాధించినా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు.

రాజకీయాల కోసం సినిమాలకు గుడ్‌బై

రాజకీయాల కోసం సినిమాలకు గుడ్‌బై

2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అనుకూలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంటే 2014 మార్చి 14న జనసేన అనే రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తెలిపాడు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ గ్యాప్‌లో ఎన్నికలు రావడం.. అందులో పవన్ ఓడిపోవడంతో మళ్లీ సినిమాల వైపు చూశాడు.

రీఎంట్రీలోనూ మోత మోగించిన పవన్

రీఎంట్రీలోనూ మోత మోగించిన పవన్

చాలా కాలం పాటు పవన్ కల్యాణ్ సినిమాలకు బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. గ్యాప్ వచ్చినా తనలోని పవర్ ఏమాత్రం తగ్గలేదని ఈ చిత్రంతో నిరూపించాడు పవన్. అంతేకాదు, ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టింది. అయితే, కొన్ని ఆటంకాలు ఈ చిత్రాన్ని దెబ్బకొట్టాయి.

వరుస మూవీలతో సత్తా.. ఇప్పుడు ఇవే

వరుస మూవీలతో సత్తా.. ఇప్పుడు ఇవే

'వకీల్ సాబ్'కు భారీ స్థాయిలో స్పందన రావడంతో పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుబాటితో కలిసి 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. దీన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. పిరియాడిక్ జోనర్‌లో ఈ మూవీ రూపొందుతోంది. వీటితో పాటు స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనూ పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయనున్నాడు. అది త్వరలోనే మొదలవుతుంది.

Recommended Video

Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu
అలా చేసిన ఏకైక స్టార్ హీరో పవర్ స్టారే

అలా చేసిన ఏకైక స్టార్ హీరో పవర్ స్టారే

సుదీర్ఘమైన కెరీర్‌లో పవన్ కల్యాణ్ ఎన్నో అవార్డులు, రికార్డులు, ఘనతలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హీరోగా తన స్టామినాను ఎప్పుడో నిరూపించుకున్న అతడు.. తన సినీ ప్రయాణంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. కొన్ని సినిమాలకు సింగర్‌గా, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించాడు. తద్వారా టాలీవుడ్‌లో ఇన్ని విభాగాల్లో పని చేసిన ఏకైక స్టార్ హీరోగా పవన్ కల్యాణ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక, అతడు నటించిన 'తొలిప్రేమ' చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కింది.

సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో విజయాలను చూడాలని.. ప్రజాసేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X