పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’ టీమ్ స్పెషల్ వీడియో
పవర్ స్టార్, జనసేన అధినేత పుట్టినరోజు సందర్భంగా 'సైరా నరిసంహారెడ్డి' టీం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేసింది. ఇప్పటి వరకు వివిధ సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలతో ఈ వీడియో రూపొందించారు.
ఆఖరి స్వాస వరకు ఈ దేశ సేవలోనే ఉంటాను.... మాట ఇచ్చానంటే తప్పే వ్యక్తిని కాదు మడమ తిప్పే వ్యక్తిని కాదు.... జీవితం మీద ఏ ఆశ లేదు. ఒక సగటు మానవుడిని, ఏదో తన వంతు చయగలను అనుకునే సగటు మనిషిని.. ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది... వెనకడుగు వేసేది లేదు ముందడుగే అంటూ వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను ఈ వీడియోలో పొందు పరిచారు.
'సైరా నరసింహారెడ్డి' సినిమా విషయానికొస్తే... మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు రూ. 150 నుండి రూ.200 కోట్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల బిగ్ బి సెట్స్‌కు వచ్చినపుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి అన్నయ్య చిరంజీవి, తన అభిమాన నటుడు అమితాబ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











