»   »  హ్యాపీ బర్త్ డే టు టాలీవుడ్ హీమ్యాన్ ‘ప్రభాస్’

హ్యాపీ బర్త్ డే టు టాలీవుడ్ హీమ్యాన్ ‘ప్రభాస్’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వాసరసుడిగా 'ఈశ్వర్'చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందాడు ప్రభాస్. రెండో చిత్రం 'రాఘవేంద్ర'తో మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేసిన 'వర్షం' కలెక్షన్ల వర్షం కురిపించి మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. 'అడవి రాముడు'లో ప్రభాస్ నటన అందర్నీ ఎంటర్ టైన్ చేసింది.

  Happy birthday to Prabhas

  కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'చక్రం' ప్రభాస్ లోని కొత్త నటుడిని వెలికి తీసింది. తన నటనతో అందరికీ కంటతడి పెట్టించిన ప్రభాస్ ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్గర్ హిట్ 'చత్రపతి'లో నటనలోని అన్ని కోణాల్ని ఆవిష్కరించి యంగ్ రెబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డుల్ని నమోదు చేయమే కాకుండా యంగ్ రెబల్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. 'పౌర్ణమి'లో చేసిన విభిన్నమైన క్యారెక్టర్ అతనికి మంచి నటుడు అన్న పేరు తెచ్చింది.

  వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'యోగి' ప్రభాస్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన 'మున్నా'లో ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన 'బుజ్జిగాడు' ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ని బయటికి తెచ్చింది. అప్పటి వరకు సీరియస్ క్యారెక్టర్స్, మాస్ క్యారెక్టర్ చేస్తూ వచ్చిన ప్రబాస్ ఆడియన్స్ ఎంటర్ టైన్ చెయ్యడంలోనూ తీసిపోనని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'బిల్లా'లో ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'ఏక్ నిరంజన్' స్టైలిష్ మాస్ హీరోగా పేరు తెచ్చింది.

  ఆ తర్వాత కరుణాకరన్ కాంబినేషన్లో వచ్చిన 'డార్లింగ్' ప్రభాస్ లోని కొత్త యాంగిల్ ని బయటికి తెచ్చింది. లవర్ బోయ్ గా 'డార్లింగ్'లో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగడమే కాకుండా యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత దశరథ్ దర్శకత్వంలో చేసిన 'మిస్టర్ పర్ ఫెక్ట్' మాస్, క్లాస్, యూత్ ఆడియన్స్ అనే తేడా లేకుండా యునానిమస్ గా ప్రభాస్ రేంజి మరింత పెంచింది. 'రెబల్' చిత్రం నెగటివ్ టాక్ లోనూ మంచి వసూళ్లు సాధించి ప్రభాస్ స్టార్ రేంజిని నిరూపించింది.

  ప్రస్తుతం ప్రభాస్ కొరటాల 'శివ' దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ పతాకంపై 'మిర్చి' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సూపర్ సక్సెస్ పుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఆర్కా మీడియా నిర్మించే భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్నారు. ఛత్రపతి కాంబినేషన్లో రూపొందబోయే ఈచిత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఇలా తను చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉండాలని కోరుకుంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరిన్ని మంచి చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాలని, అభిమానులను ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటూ అక్టోబర్ 23న బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ హీమ్యాన్ యంగ్ రెబల్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Prabhas Raju Uppalapati (born 23 October 1979), He made his debut with Eeshwar. After playing the role of a lover boy in the 2004 blockbuster film Varsham, Prabhas continued in this vein, gaining mass appeal and appearing in many successful films such as Chatrapathi, Munna, Bujjigadu and Billa. After gaining success, he started experimenting with youthful family entertainers like Darling and Mr Perfect which were successful at the box office.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more