twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తను చేసిన సినిమాలపై ప్రభాస్ స్వీయ విశ్లేషణ , ఏది నచ్చింది? ఏది నచ్చలేదు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆరడుగులకు కొంచెం ఎక్కువ. ట్రై చేయకుండానే సిక్స్‌ప్యాక్‌ తిరిగిన దేహం. 'హీరో అంటే ఇలా ఉండాలి' అని చెప్పడానికి ఉదాహరణలు వెతుక్కోవలసిన అవసరం లేదు. ఒక్క ప్రభాస్‌ని చూపిస్తే చాలు. ప్రభాస్‌ అంటే యాక్షన్‌ హీరోనే అనుకోవడం తప్పు. తన చిత్రాలతోనే కాక తన రూపంతోనూ, నటనతోనూ జన హృదయాల్ని గెలిచారు ప్రభాస్.

    వర్షం, ఛత్రపతి, బుజ్జిగాడు, డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, మిర్చి,బాహుబలి - ప్రతి హిట్ లోనూ ఓ విభిన్నత ను చూపిస్తూ ముందుకు దూసుకుపోయే తత్వం. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోనే ప్రయత్నం. అవే ప్రభాస్‌ని అందరికీ దగ్గర చేశాయి. ఇప్పుడు ప్రభాస్‌ క్లాసు, మాసు తేడా తెలియని ఫ్యామిలీ హీరో. అందరికీ నచ్చే మిర్చిలాంటి కుర్రాడు..!

    2002లో 'ఈశ్వర్' సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఈ పదకొండేళ్లలో పదహారు సినిమాలు చేశారు. తొలి చిత్రంతోటే ఆకట్టుకున్న ఆయన ఎమ్మెస్ రాజు నిర్మించగా శోభన్ దర్శకత్వం వహించిన తన మూడో చిత్రం 'వర్షం'తో క్రేజీ స్టార్‌గా మారారు.ఇక రాజమౌళి రూపొందించిన 'ఛత్రపతి'తో మాస్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

    మధ్యలో కొన్ని సినిమాలు ఓ మాదిరిగా ఆడినా, మరికొన్ని సినిమాలు సరిగా ఆడకపోయినా 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమాలతో అందరికీ డార్లింగ్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'మిర్చి' గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. పెద్ద హిట్. ఇక బాహుబలి- ది బిగినింగ్ గురించి రోజూ చెప్పుకుంటునే ఉన్నాం . ప్రస్తుతం ఆయన రాజమౌళితో 'బాహుబలి- ది కంక్లూజన్' చేస్తున్నారు. ఈ రోజు ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి తాను ఏమనుకొంటున్నాడు..? అనేది చూద్దాం.

    వర్షం

    వర్షం

    ప్రభాస్‌కి కెరిల్ మొదటి హిట్...తొలి విజయం. అలాంటిలాంటి విజయం కాదు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన చిత్రమిది. 'ఈశ్వర్‌', 'రాఘవేంద్ర' సినిమాల్లో ప్రభాస్‌లో యాక్షన్‌ హీరోనే చూశారు. ఫైట్లు బాగా చేస్తాడు అనే పేరు మాత్రమే వచ్చింది. ఈ సినిమాతో ప్రేమకథలకూ నప్పుతాడు అని నిరూపించుకొన్నాడు. ''అమ్మాయిల నుంచి ప్రేమలేఖలు రావడం ఈ సినిమాతోనే మొదలయ్యాయి'' అని సిగ్గుపడుతూ చెబుతుంటారు ప్రభాస్‌.

    ఛత్రపతి

    ఛత్రపతి

    'నా కెరీర్‌లో తిరుగులేని చిత్రమిది. ఎన్ని సినిమాలు చేసినా ఛత్రపతిని మర్చిపోను' అని చెప్తుంటారు ప్రభాస్‌. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్‌కి యాక్షన్‌ హీరోగా తిరుగులేని స్థానాన్ని కట్టబెట్టింది. 'ఒక్క అడుగు... ఒక్క అడుగు..' అంటూ ప్రభాస్‌ పలికిన సంభాషణలు ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపాయి. కొన్ని సెంటిమెంట్‌ సన్నివేశాల్లోనూ నటించి కంటతడి పెట్టించారు. ప్రభాస్‌లోని ప్రతిభను నూటిని నూరుపాళ్లూ వాడుకొన్న తొలి చిత్రమిదేనేమో..అని అందరూ అంటూంటారు

    చక్రం

    చక్రం

    ''చక్రం నా మనసుకి నచ్చిన చిత్రం. సరిగా ఆడలేదు గానీ.. ఇప్పటికీ నన్ను కలసిన చాలామంది చక్రం సినిమా గురించి చాలా చాలా విషయాలు మాట్లాడతారు. అవన్నీ వింటే సంతోషంగా అనిపిస్తుంది'' అని గుర్తుచేసుకొంటారు ప్రభాస్‌. కేవలం యాక్షన్ కి మాత్రమే పరిమితం కాకుండా నటుడిగా వందకు వంద మార్కులూ 'చక్రం'తో వచ్చాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్‌ని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసింది.

    బుజ్జిగాడు

    బుజ్జిగాడు

    . ''యాక్షన్‌ సినిమాలు చేసీ చేసీ నాకు నేనే బోర్‌ కొట్టేశా. కొన్నాళ్ల పాటు కథలేవీ వినలేదు. 'ఈశ్వర్‌' తరవాత నాకు విరామమే లేదు. ఆరు నెలలు గ్యాప్‌ తీసుకొని చేసిన కథ 'బుజ్జిగాడు'. టీవీల్లో ఎన్నిసార్లు చూసినా విసుగెత్తని సినిమాల్లో ఇదొకటి'' అన్నారు ప్రభాస్‌.'యాండే.. ఏదైనా మాట్టాడండే.. ఓ పాట పాడండే..' - అప్పటి వరకూ చూసిన ప్రభాస్‌ వేరు. 'బుజ్జిగాడు'లోని ప్రభాస్‌ వేరు. మాట, నడక, నటన అన్నీ మారిపోయాయి. ప్రభాస్‌లోని కొత్త నటుడు తెరపైకి వచ్చి సందడి చేశాడు. ప్రభాస్‌ వెటకారంగా పలికిన ప్రతీ సంభాషణనీ ప్రేక్షకులు ఆస్వాదించారు. ఆశీర్వదించారు.

    డార్లింగ్‌ - మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌:

    డార్లింగ్‌ - మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌:

    ''ముందు ఈ కథలు వింటున్నప్పుడు భయపడ్డా. 'నాకు పరిపడవు.. చేయలేను' అనే నిర్ణయానికి వచ్చేశా. కానీ 'ప్రభాస్‌ ఇలాంటి కథలకే పరిమితమయ్యాడు అనే పేరు నీకొద్దు. కొత్తగా ఎలాంటి సినిమా వచ్చినా చెయ్‌' అని పెదనాన్నగారు తరచూ చెబుతుంటారు. అవి గుర్తొచ్చే ఈ కథల్ని ఒప్పుకొన్నా... అనేది ప్రభాస్‌ మాట.

    ప్రభాస్‌ తన ఇమేజ్‌కి దూరంగా జరిగి చేసిన సినిమాలివి. ఒక విధంగా ప్రయోగాలే అనుకోవాలి. ప్రభాస్‌ వేషధారణ, హావభావాలూ అన్నీ ఈ సినిమాల్లో పూర్తిగా మారిపోయాయి. 'డార్లింగ్‌'లో అయితే ఆయన కాస్ట్యూమ్స్‌ని అందరినీ ఆకట్టుకొన్నారు. నవతరంలో డార్లింగ్‌ వేషధారణ ఓ పోకడగా మారింది. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ. ఇలాంటి కథలో ఇమిడిపోవడం ప్రభాస్‌కి పూర్తిగా కొత్త. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొన్నాయి.

    మిర్చి

    మిర్చి

    'ప్రేమిస్తే పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే' లాంటి సంభాషణలు ఎన్నో. ''నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. అందుకే త్వరగా లీనమైపోయా..'' అని ఈ సినిమా గురించి చెప్తుంటారు ప్రభాస్‌. కమర్షియల్‌ హీరోగా ప్రభాస్‌ని మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. రెండు విభిన్నమైన కోణాల్లో సాగే ప్రభాస్‌ పాత్ర చిత్రణ అందరినీ ఆకట్టుకొంది. ఆయన స్త్టెల్‌, మాట తీరు యువతరానికి బాగా నచ్చింది.,

    షాక్ ఇచ్చింది

    షాక్ ఇచ్చింది

    'మిర్చి' సినిమా ఆయన క్రేజ్‌ను అసాధారణంగా పెంచేసింది. అదివరకు విడుదలైన 'రెబల్' సినిమా ఫ్లాపైనప్పటికీ దానికి వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. ప్రేక్షకుల్లో ఆయన ఇమేజ్ పెరుగుతున్నదనే నిజాన్ని ఆ సినిమా తెలియజేసిందని అంటారు ప్రభాస్. ప్రభాస్‌ను ఎలా చూపిస్తే యువత వెర్రెత్తుతుందో పసిగట్టినట్లుగా 'మిర్చి'లో ఆయన కేరక్టర్‌ను మలిచి, మంచి ఫలితాన్ని రాబట్టారు దర్శకుడు కొరటాల శివ.

    ప్రతీదీ స్పెషలే...

    ప్రతీదీ స్పెషలే...

    ''నా ప్రతి సినిమా నాకెన్నో విషయాలు నేర్పింది. అందుకే నేను చేసిన సినిమాలన్నీ నాకు ప్రత్యేకమే'' అంటుంటారు ప్రభాస్‌.విజయ, పరాజయం... ఈ రెండూ ప్రభాస్‌కి తెలుసు. వాటి మధ్య సన్నని గీత మాత్రమే తేడా ఉంటుందనీ తెలుసు. కానీ ఆ గీత దాటడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో..? ఎంత శ్రమించాడో..? ప్రతి సినిమా ఓ పాఠమే. నేర్చుకొంటూ ఎదిగాడు. ఒక్కో మెట్టూ ఎక్కాడు. ఇప్పుడు వంద కోట్ల హీరో అయ్యాడు.

    ‘బాహుబలి' క్రేజ్

    ‘బాహుబలి' క్రేజ్

    ‘మిర్చి' హిట్‌తో ఊపుమీదున్న ప్రభాస్ ఆ తర్వాత ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి' చిత్రంలో చేసారు. ఈ చిత్రం ప్రారంభంకాకముందే అనేక అంచనాలతో సంచలనం సృష్టించింది. రిలీజ్ అయ్యాక సంచలనమే అయ్యింది. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మైలురాయిలా నిలిచింది. 'బాహుబలి'తో ప్రభాస్‌కి బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలొచ్చాయి. బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో ప్రభాస్‌ మైనపు బొమ్మని ప్రతిష్టించబోతున్నారు. ఈ ఘనత అందుకొన్న తొలి దక్షిణాది కథానాయకుడు అతనే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కి అభిమానులు ఏర్పడ్డారు.

    టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ

    టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ



    అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'బాహుబలి-2'లో మహేద్ర బాహుబలిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు ప్రభాస్. ఈ చిత్రం ఆయన కెరీర్‌ని మరో మలుపుతిప్పి మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు అధికంగానే ఉన్నాయి.

    ఫస్ట్ లుక్ కు ఫస్ట్ క్లాస్ రెస్పాన్స్..

    ఫస్ట్ లుక్ కు ఫస్ట్ క్లాస్ రెస్పాన్స్..

    ఆదివారం ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్...'బాహుబలి 2'లో ప్రభాస్‌ లుక్‌ని ఆవిష్కరించింది. ఓ చేతిలో గొలుసులు, మరో చేతిలో ఆయుధం, సిక్స్ ప్యాక్ బాడీ, కళ్లలో మెరుపు, చూపులో చురుకు, నడకలో రాజసం... ఇవన్నీ కలగలిపి మహేంద్ర బాహుబలికి కొత్త వన్నెలు తీసుకొచ్చాయి.

    'కటౌట్లు చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌..!'

    'కటౌట్లు చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌..!'

    యూత్ లో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న నటుల జాబితాలో ప్రభాస్ చేరిపోయారు. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు సత్కరించనున్నారు. ఈ సంధర్బంగా ధట్స్ తెలుగు ప్రబాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

    English summary
    Prabhas celebrate his birthday today (Oct 23rd). His Mirchi went on to became one of the biggest blockbusters of Tollywood and he is now doing a movie in three languages - Rajamouli's magnum opus, Baahubali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X