twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Prabhas: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి.. అలా చేసిన ఏకైక ఇండియన్ హీరో.. తారక్ మూవీలో అతిథి పాత్ర

    |

    సీనియర్ హీరో కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. ఇక్కడ తన హవాను చూపించాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, అప్పటి నుంచి ఏక కాలంలో వరుసగా అన్నీ భారీ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ప్రభాస్ నేడు 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను గురించి తెలుసుకుందాం పదండి!

     పశ్చిమ గోదావరి టూ పాన్ ఇండియా స్టార్

    పశ్చిమ గోదావరి టూ పాన్ ఇండియా స్టార్

    ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న ప్రభాస్.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు జన్మించాడు. సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు అతడికి పెదనాన్న అవుతారు. ప్రభాస్‌కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. అతడి తండ్రి సూర్యనారాయణరాజు గోపీకృష్ణ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించారు.

    అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

    ఈశ్వర్‌తో పరిచయం.. అలా భారీ హిట్‌తో

    ఈశ్వర్‌తో పరిచయం.. అలా భారీ హిట్‌తో

    ఈశ్వర్ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు ప్రభాస్. ఇది బాగానే ఆడినా.. భారీ సక్సెస్ మాత్రం కాలేదు. ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర నిరాశనే మిగిల్చింది. అయితే, దీని తర్వాత వచ్చిన 'వర్షం' మాత్రం ప్రభాస్‌కు భారీ హిట్‌ను అందించింది. దీంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకు యంగ్ రెబెల్ స్టార్ అయ్యాడు.

    ఐదేళ్లలో అదొక్కటే భారీ హిట్ వచ్చింది

    ఐదేళ్లలో అదొక్కటే భారీ హిట్ వచ్చింది

    'వర్షం' తర్వాత ప్రభాస్ చేసిన పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి తీసిన 'ఛత్రపతి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు వరుస పరాజయాలతో ప్రభాస్ సతమతం అయ్యాడు. దీంతో అతడి కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది అన్నారు.

    మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురుమితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

    డార్లింగ్‌తో కొట్టి మిస్టర్ పర్‌ఫెక్ట్ అయ్యాడు

    డార్లింగ్‌తో కొట్టి మిస్టర్ పర్‌ఫెక్ట్ అయ్యాడు

    వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సమయంలో 'డార్లింగ్' అనే క్లాస్ సినిమాతో సక్సెస్‌ను అందుకున్నాడు ప్రభాస్. దీంతో అతడికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ వెంటనే 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మూవీతో బిగ్ హిట్ కొట్టడంతో పాటు సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన 'రెబెల్' నిరాశనే మిగిల్చింది.

    మిర్చి లాంటోడు... బాహుబలి అయ్యాడు

    మిర్చి లాంటోడు... బాహుబలి అయ్యాడు

    కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు ప్రభాస్. ఈ ఉత్సాహంతోనే దర్శకుధీరుడు రాజమౌళితో 'బాహుబలి' సిరీస్ చేశాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అలాగే, వేరే దేశాల్లోనూ ఫాలోయింగ్ సంపాదించాడు.

    Bigg Boss: సన్నీని బుక్ చేసిన ప్రియ ఫ్యాన్స్.. గొడవ జరగడానికి అతడే కారణం.. ఆ ఫొటోలు బయట పెట్టడంతో!Bigg Boss: సన్నీని బుక్ చేసిన ప్రియ ఫ్యాన్స్.. గొడవ జరగడానికి అతడే కారణం.. ఆ ఫొటోలు బయట పెట్టడంతో!

    రేంజ్ పెరిగింది.. అన్నీ ఆ సినిమాలతో

    రేంజ్ పెరిగింది.. అన్నీ ఆ సినిమాలతో

    'బాహుబలి' తర్వాత ప్రభాస్ 'సాహో' అనే సినిమా చేశాడు. ఇది హిందీలో బాగా ఆడడంతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ జోష్‌లోనే వరుసగా పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ K', 'స్పిరిట్' వంటి భారీ నుంచి అతి భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

    ప్రభాస్‌ ఘనతలు.. ఏకైక ఇండియన్‌గా

    ప్రభాస్‌ ఘనతలు.. ఏకైక ఇండియన్‌గా

    సుదీర్ఘమైన కెరీర్‌లో ప్రభాస్ ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మరీ ముఖ్యంగా బాహుబలితో వేయి కోట్లు దాటిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు అందుకున్నాడు. అలాగే, మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి సౌతిండియన్ స్టార్ ప్రభాసే. ఇవే కాదు.. ఇంకా ఎన్నో సాధించాడు. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

    <strong>టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!</strong><br />టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

    Recommended Video

    Romantic Trailer | Prabhas Praises Akash Puri And Ketika Sharma
    ఎన్టీఆర్ సినిమాలో ఆ పాత్ర.. హిందీలో

    ఎన్టీఆర్ సినిమాలో ఆ పాత్ర.. హిందీలో

    ప్రభాస్ కొన్ని సినిమాల్లో కామియో రోల్స్ చేశాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ' మూవీలో టైటిల్ కార్డ్స్ పడే సమయంలో విశ్వామిత్రుడిగా తళుక్కున మెరిశాడు ప్రభాస్. ఈ విషయం చాలా మందికి తెలీదు. అలాగే, అజయ్ దేవగణ్ నటించిన 'యాక్షన్ జాక్సన్' సినిమాలోనూ అతిథి పాత్రను చేశాడు. వీటితో పాటే 'దేనికైనా రెడీ'లోనూ వాయిస్ వినిపించాడు.

    సినీ హీరోగా ప్రభాస్ ఎన్నో విజయాలను చూడాలని.. తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేయాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున పాన్ ఇండియా స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Pan India Star Hero Prabhas Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Best Moments of his Career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X