»   » దర్శక ‘బాహుబలి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు

దర్శక ‘బాహుబలి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి అపజయం అంటూ ఎరుగకుండా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. మనోడు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా విజయం వెతుక్కుంటూ మరీ వస్తోంది. స్టార్ హీరోలను పెట్టి సినిమా తీసినా, స్టార్ ఇమేజ్ లేని వాళ్లతో చేసినా..అసలు హీరో లేకుండా ఈగల్ని పెట్టి తీసినా హిట్టవుతోంది. మరి ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన విషయం ఉంది కాబట్టే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగి పోయారు. ఈ రోజు రాజమౌళి పుట్టినరోజు. అక్టోబర్ 10, 1973లో జన్మించిన రాజమౌళి నేటితో 41 వసంతాలు పూర్తి చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా వన్ ఇండియా ఫిల్మీబీట్ తరుపున రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడైన రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం రాజమౌళి ప్రత్యేకత.

బాహుబలి సినిమాతో రాజమౌళి స్థాయి భారత దేశ సరిహద్దులు దాటింది. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ సంచలనం. వసూళ్ల పరంగా బాక్సాఫీసు వద్ద కాసుల సునామీ సృష్టించింది. త్వరలో బాహుబలి-2 సినిమా రాబోతోంది. మరి ఆ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Happy Birthday Rajamouli

రాజమౌళి సినమాలు....
2001-స్టూడెంట్ నంబర్ 1, జూనియర్ ఎన్.టి.ఆర్., గజాలా, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు
2003-సింహాద్రి, తారాగణం: జూనియర్ ఎన్.టి.ఆర్., భూమిక, అంకిత, నాజర్, ముఖేష్ రిషి
2004-సై, తారాగణం: నితిన్, జెనీలియా, శశాంక్, రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్
2005-ఛత్రపతి, తారాగణం: ప్రభాస్, శ్రియా, భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్
2006-విక్రమార్కుడు, తారాగణం: రవితేజ, అనుష్క శెట్టి, అజయ్, వినీత్ కుమార్, బ్రహ్మానందం
2007-యమదొంగ, తారాగణం: జూనియర్ ఎన్.టి.ఆర్., ప్రియమణి, మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం
2009-మగధీర, తారాగణం: రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్
2010-మర్యాద రామన్న, తారాగణం: సునీల్, సలోని, నాగినీడు, సుప్రీత్, వేణుగోపాల్
2012-ఈగ, తారాగణం: నాని, సమంత, సుదీప్
2015-బాహుబలి, తారాగణం: ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా

English summary
Rajamouli is celebrating her 42nd Happy Birthday today.
Please Wait while comments are loading...