గబ్బర్ సింగ్ నాయిక శృతి హాసన్‌కు శుభాకాంక్షలు
గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న శృతి హాసన్ నేడు పుట్టి రోజు జరుపుకుంటోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసిన శృతి జనవరి 28, 1986న జన్మించింది. తొలుత సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా కెరీర్ ప్రారంభించిన శృతి హాసన్ 'లక్' అనే బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. 'అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా తెలుగులో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా ప్లాపయినా శృతి అంద చందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. గత సంవత్సరం సిద్ధార్థతో కలిసి నటించిన'ఓ మై ఫ్రెండ్' చిత్రం యావరేజ్ గా నిలించింది. ఈ సంవత్సరం శృతి హాసన్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ తో జంటగా నటించిన '3' సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ తో నటించిన 'గబ్బర్ సింగ్'పై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే '3' సినిమా కొలవెరి సాంగుతో యమ పాపులర్ అయింది. ఆ సినిమా హిట్టవ్వడం ఖాయమని ఇప్పటికే ట్రేడ్ వర్గాలే తేల్చేసాయి. ఇక తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న శృతి హాసన్ కు 'గబ్బర్ సింగ్' ప్లస్సవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శృతి కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని ఆశిస్తూ వన్ ఇండియా.కామ్ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం.


Click it and Unblock the Notifications











