»   » క్యూటీ... నిన్ను మిస్సవుతున్నా: భార్య గురించి అల్లు అర్జున్ ట్వీట్

క్యూటీ... నిన్ను మిస్సవుతున్నా: భార్య గురించి అల్లు అర్జున్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి నేడు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. అయితే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగులో బన్నీ వేరే చోట ఉండటంతో ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.

'హ్యాపీ బర్త్ డే స్నేహ. ఐ మిస్ యు క్యూటీ' అంటూ ట్వీట్ చేశాడు. బన్నీ తన భార్యను విష్ చేసిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బన్నీ-స్నేహ మధ్య ఉన్న గాఢమైన ప్రేమకు ఇది నిదర్శనం అని అంటున్నారు.

బన్నీ ట్వీట్

బన్నీ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ కులాలు, ప్రాంతాలు వేరైనా అలాంటివేమీ పట్టించుకోకుండా ఆదర్శ వివాహం చేసుకున్నారు ఇద్దరు. మార్చి 6, 2011లో పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది.

ఊటీలో...

ఊటీలో...

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా షూటింగులోభాగంగా ఊటీలో ఉన్నట్లు సమాచారం. సెట్స్ లో దసరా ఆయుధ పూజ ఫోటోను బన్నీ పోస్టు చేశారు.

స్నేహను ఎంతగా ప్రేమించాడంటే..

స్నేహను ఎంతగా ప్రేమించాడంటే..

ఇటీవల ఓ సందర్భంలో అల్లు అర్జున్ తన లవ్ మెమొరీస్ గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో కెరీర్, ప్రేమ ఏది ఎంచుకోవాలనే సందిగ్ధ పరిస్థితిలో కొట్టుమిట్టాడానని, ఆ సమయంలో స్నేహారెడ్డిని మిస్సవుతానేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ వెల్లడించారు. 'దేశ ముదురు' సినిమా షూటింగ్ సమయంలో తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెప్పిన అల్లు అర్జున్ అప్పటి విషయాలను నెమరు వేసుకున్నారు.

‘దేశ ముదురు' షూటింగ్ సమయంలో....

‘దేశ ముదురు' షూటింగ్ సమయంలో....

ఓసారి తనకు ఒక పెద్ద సమస్య వచ్చిందని, ప్రియురాలు స్నేహారెడ్డి వద్దకు వెళ్లాలా? లేక ‘దేశ ముదురు' షూటింగ్ కోసం మనాలి వెళ్లాలా? అనే సంధిగ్దత తలెత్తిందని తెలిపాడు. రెండింటిలో ఏదైనా ఒకటే ఎంచుకునే ఆ పరిస్థితిలో చాలా తికమకపడ్డానని అల్లు అర్జున్ తెలిపారు.

తర్వాత స్నేహ ప్రేమను పొందాను

తర్వాత స్నేహ ప్రేమను పొందాను

ఒక వేళ షూటింగ్ కోసం మనాలి వెళ్తే, స్నేహను మిస్ అయిపోతానేమో అనే భయం వేసింది. అయితే, షూటింగుకే ప్రాధాన్యతను ఇచ్చి మనాలి వెళ్లాను. అప్పుడు తాను సరైన నిర్ణయం తీసుకున్నాను. తర్వాత స్నేహ ప్రేమను పొందాను అని అల్లు అర్జున్ తెలిపారు.

English summary
"Happy Birthday Sneha, I miss you cutieeee" Allu Arjun tweeted. Allu Arjun and Sneha Reddy married in 2011 and have two children, a son and a daughter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu