»   »  ‘క‌ళావ‌తి’ ద‌ర్శ‌కుడుకి బర్త్ డే విషెస్ తెలిపిన నిర్మాతలు

‘క‌ళావ‌తి’ ద‌ర్శ‌కుడుకి బర్త్ డే విషెస్ తెలిపిన నిర్మాతలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

త‌మిళం లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క్రేజి ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు సుందర్ సి ఈరోజు(21జ‌న‌వ‌రి) జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా క‌ళావ‌తి తెలుగు వెర్ష‌న్ స‌మ‌ర్ప‌కుడు శ్రీ జ‌వ్వాజి రామాంజ‌నేయులు, స‌ర్వంత్రామ్ క్రియోష‌న్స్ మ‌రియు నిర్మాత‌లు గుడ్‌ఫ్రెండ్స్ పుష్ప‌గుచ్చం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. తమిళంలో ఆరణ్మనిగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌య్యి ఇప్ప‌డు అర‌ణ్మ‌యి 2 గా ఇప్ప‌టికే త‌మిళ‌నాట సంచ‌ల‌నాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో క‌ళావ‌తి అనే టైటిల్ తో తెలుగులో ఇటీవ‌ల యూనిట్ స‌భ్యుల స‌మ‌క్షంలో ఆడియో ఫంక్ష‌న్ చేశారు. ఆడియో ఇప్ప‌టికే మంచి విజ‌యం సాదించ‌గా చిత్రాన్ని జ‌న‌వ‌రి 29న విడుద‌ల చేస్తున్నారు. ఈచిత్రాన్ని . సర్వంత్రామ్‌ క్రియేషన్స్ మ‌రియు ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి ప‌లు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ తెలుగు లో నిర్మిస్తున్నారు. శ్రీ జవ్వాజి రామాంజనేయులు చిత్ర స‌మ‌ర్ప‌కులు, ఈ చిత్రంలో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు.

భయ పెడుతున్న త్రిష-హన్సిక: ‘కళావతి' థియేట్రికల్ ట్రైలర్

Happy birthday to Sundar C

ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న క‌ళావ‌తి చిత్రం యెక్క ఆడియోని విడుద‌ల చేశాము. ఆడియో ఇప్ప‌టికే మార్కెట్ లో విడుద‌ల‌య్యి ఆద‌ర‌ణ పోందుతున్నాయి. . ఈచిత్రం కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా తెలుగు రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని మా న‌మ్మ‌కం. .మా సంస్థలైన గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్రామ్ క్రేయేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సైతం భారీ పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు జ‌న‌వ‌రి 29న తీసుకురాబోతున్నాం. మా ద‌ర్శ‌కుడు సుందర్ సి గారికి మా యూనిట్ అంద‌రి త‌రుపున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాము. మాచిత్రంలో సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ అవుతారు.ఈ చిత్రం మెద‌టి భాగం కంటే మా క‌ళావ‌తి లో రెండింత‌లు ఎంటర్ టైన్ మెంట్ ను దర్శకుడు అందించబోతున్నారు.' అని అన్నారు.

సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు నటీనటులు - సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి సంగీతం - హిప్ హాప్ తమిఝా దర్శకుడు - సుందర్ సి నిర్మాత - గుడ్ ఫ్రెండ్స్.

English summary
Today (Jan 21), director Sundar C birthday. Yes, Sundar C who is known for directing many hit comedy entertainers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu