»   » సౌతిండియా నెం.1 హీరో రజనీ పుట్టనరోజు నేడు

సౌతిండియా నెం.1 హీరో రజనీ పుట్టనరోజు నేడు

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సౌతిండియా నెం.1 హీరో, దక్షిణభారత దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.. అతనే శివాజీరావ్‌ గైక్వాడ్‌ అలియాస్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈరోజు ఆయన పుట్టినరోజు. 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63 వ ఏట అడుగుపెడుతున్న ఆయన జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇలాంటి తేదీ (12-12-12) వచ్చేది ఈ ఒక్కరోజే కాబట్టి. ఈ ప్రత్యేక తేదీని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఈ వేడుకలను స్పెషల్ గా నిర్వహిస్తున్నారు.

  ఆయన జీవితం చూస్తే సినిమా కష్టాలు అంటాం కాని అంతకంటే ఎక్కువగానే ఓ విజయవంతమైన సినిమాకు సరిపడే చరిత్ర రజనీకి ఉంది. అయిదేళ్ల వయసులోనే ఆయన తల్లిని పొగొట్టుకున్నారు. తిండికి నానా పాట్లు పడుతూ ప్రభుత్వ పాఠశాలలో కన్నడ మీడియంలో చదువుకున్నారు. తరువాత జీవన సమరంలో అనేక కష్టాలు పడ్డారు. మూటలుమోసే కూలిగా పనిచేశారు. ఆ తరువాత బస్‌ కండక్టర్‌గా పనిచేశారు. నాటకాలంటే మక్కువతో ఎన్నో నాటకాల్లో నటించారు. స్నేహితుల ప్రోత్సాహంతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్‌ దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగళ్‌' సినిమాలో 1975లో నటించారు. ఆపూర్వ రాగంగళ్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన రజినీకాంత్ 158 చిత్రాల్లో నటించారు.

  'మొండ్రు ముడిచు' '16 వయదినిలె'సినామాలతో మొదలైన విజయయాత్ర ముందుకు తప్ప వెనుకడుగు లేకుండా దూసుకువెళ్లింది. ఆ తరువాత ఆయన హీరోయిజమ్‌కు తనదైన స్త్టెల్‌ సమకూర్చారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అనితర సాధ్యమైన రజనీ స్త్టెల్‌ను ఆవిష్కరించారు. అదే ఆయనను ఆమ్‌ఆద్మీకి చేరువ చేసింది. లక్షలాది హృదయాలను కొల్లగొట్టింది. నాటితరంనుంచి నేటితరం వరకు ఆయనకు అభిమానులను సంపాదించిపెట్టింది. అంతర్జాతీయంగా కూడా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. రష్యన్లకు రాజ్‌కపూర్‌ ఎంతో జపనీయులకు ఇప్పుడు రజనీ అంత.

  తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రల నుంచి సూపర్‌స్టార్‌గా ప్రకాశిస్తున్న రజినీకాంత్ అభిమానులకు ఆరాధ్యదైవం. అంతేకాదు.. రజినీకాంత్ భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమాల్లో హీరోగా నటించిన ఘనత సాధించాడు. అలాగే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుని తన రికార్డులు తానే అధిగమించిన ఒకే ఒక్క హీరో రజనీకాంత్‌. అటు సేవ చేయడంలోనూ రజనీకాంత్ తనదైన ముద్ర వేసారు.

  ఇతర హీరోల్లా కాకుండా ఆయన మేకప్‌ తుడిచేస్తే అందరిలాంటి సాధారణ వ్యక్తిలా ఉంటారు. ఎలాంటి హంగులు లేకుండా హుందాగా తన వయస్సును స్వీకరించిన పెద్దమనిషిలా ఉంటారు. అది ఆయనకు ఎంతో గౌరవాన్ని సంపాదించిపెట్టింది. సినిమాల్లో ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌... అభిమానులకు ప్రత్యక్షదైవం... క్లాస్‌ ఆడియన్స్‌కు ఆయనో నటనా పాఠశాల... మొత్తంమీద అందరికీ మాత్రం ఆయన సినిమా ఇండస్ట్రీకి భగవంతుడు ప్రసాదించిన వరం... తరాలు మారినా తరగని అదే అభిమానంతో ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం..

  English summary
  Superstar Rajinikanth celebrates his 62nd birthday on Wednesday (12-12-12). This birthday will be a very special one for the actor as it falls on the magical date.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more