twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిల్కీ బ్యూటీ తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

    By Bojja Kumar
    |

    'శ్రీ' సినిమా ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి మిల్కీబేబీ తమన్నా భాటియా....'హ్యాపీ డేస్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హిట్ తో తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్లింది. 2009, 2010లో రెండు సంవత్సరాలు టాలీవుడ్ కి దూరమై కోలీవుడ్ లో వరుస సినిమాలతో దుమ్ము రేపింది. మళ్లీ '100% లవ్‌'తో రీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా... వస్తూనే సంచలన విజయం నమోదు చేసిన తమన్నా ఆ తర్వాత వచ్చిన 'భద్రీనాధ్‌', 'ఊసరవెల్లి' చిత్రాలతో ఫరవాలేదనిపించుకుంది.

    తమన్నా ప్రస్తుతం రామ్ చరణ్‌ తేజ'రచ్చ', ప్రభాస్‌తో 'రెబల్‌', రామ్ తో 'ఎందుకంటే ప్రేమంటే' చిత్రాలలో నటిస్తోంది. వచ్చే సంవత్సరం కూడా అగ్రహీరోలతో హల్‌ చల్‌ చేయనుంది. ఇవాళ ఈ మిల్కీ బ్యూటీ పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. 1989 డిసెంబర్ 21న జన్మించిన తమన్నా ముంబై వాసి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె 'చాంద్ సా రోషన్ చెహ్రా సినిమా' ద్వారా ఇండస్ట్రీలోకి అడుగిడింది. ఇండస్ట్రీకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. మరి ఈ భామ మరిన్ని సినిమాలతో ప్రేక్షుకులను మరింత రంజింప చేయాలని ఆవిస్తూ వన్ ఇండియా తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

    English summary
    Tamanna, the milky girl today celebrating her 21st birthday. She born on 21st of December, 1989. She has become an overnight star in Tollywood with Sekhar Kammula’s ‘Happy Days’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X