twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వాల్మీకి’గా అక్కినేని అభినయం అభిసంశనీయం...!

    By Sindhu
    |

    విప్రనారాయణ, చక్రధారి, భక్తతుకారం, భక్త జయదేవ్, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాల్లో అసమాన అభినయకౌశలంతో ప్రేక్షకుల్ని రంజింపజేసిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు తాజాగా 'శ్రీరామరాజ్యం" చిత్రంలో వాల్మీకి పాత్రలో దర్శనమివ్వబోతున్న విషయం తెలిసిందే. వాల్మీకి పాత్రను అక్కినేని పోషిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేకార్షణగా నిలిచింది. ఏ పాత్రలోనైన పరకాయప్రవేశం చేసి ఆ పాత్రకు నిండుదం చేకూర్చే అక్కినేని వాల్మీకి పాత్రలో కూడా అద్భుతాభినయంతో అలరించాడని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. .

    నటసామ్రాట్‌ గా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం ఏర్పరచుకున్న అక్కినేని సినిమా హీరోగా 67వసంతాలు...నిజ జీవితంలో 87 వసంతాలు. రంగస్థల నటుడిగా 82 వసంతాలు, సినీ అగ్రనటుడిగా 71 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీరంగ ఏకైక నటుడు ది లివింగ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరావు. ఎన్నోపరిపూర్ణ, వైవిధ్య భరిత పాత్రలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఒక ప్రేమికుడుగా, సెయింట్ గా, తండ్రి, తాత, సోదరుడు, తాగుబోతు ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన జీవించారు. దేవుని పాత్రల్లోనూ ఆయన మిళితమైపోయారు. మరి అటువంటి లివింగ్ లెజెండ్ కి జన్మధిన శుభాకాంక్షలు తెలుపకపోతే ఎలా....దట్స్ తెలుగు తరపూన మీరూ చెప్పేయండి జన్మదిన శుభాకాంక్షలు...

    English summary
    He is known as the only living legend of Tollywood cinema and has stood the league of the great N T Rama Rao. Still young at heart and known for his strong oratory skills, he made a mark as an actor and a successful man.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X