బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు...

By Staff

Balakrishna
బాలయ్య అని అభిమానులచే ముద్దుగా పిలవబడే నందమూరి బాలకృష్ణ ఈ రోజు 48 వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 'తాతమ్మ కల' సినిమాతో తన 15 వ యేట తెరంగ్రేటం చేసిన బాలకృష్ణ యువరత్న గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవటానికి శ్రమించారు. పాత్రల్లో జీవించారు. బాలనటుడుగా తన తండ్రిగారైన యన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో 'దానవీరసూరకర్ణ' లో అభిమన్యుడిగా నటించి జేజేలు అందుకున్నాడు. తరువాత పూర్తి స్ధాయి హీరోగా చేసిన 'డిస్కోకింగ్' (1984) అప్పట్లో సంచలనం. అలాగే 'మంగమ్మ గారి మనువడు' వంటి చిత్రాలతో గ్రామీణ భారతాన్ని ఆకట్టుకున్నారు. ఇక ఈ నందమూరి అందగాడు తర్వాత కాలంలో బాక్సాఫీస్‌ బొనాంజాగా సెటిల్ అయ్యాడు. అలా మొదలైన సినీ ప్రయాణం నేటి పాండురంగడు దాకా అలపెరగకుండా పరిణితి చెందిన నటనను సాధించుకుంటూ సాగిపోతోంది.

అభిమానుల జేజేల మధ్య జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం బాలకృష్ణకి అలవాటు. అయితే ఈసారి ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ నెల 15న లోకేష్‌ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకోబోతున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు .దాంతో గత యేడాది వివాహమైన తన కుమార్తె బ్రహ్మణి, అల్లుడు లోకేష్ సమక్షంలో తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఆయన అమెరికాలో వున్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఈ వేడుకను ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌ ప్రాంగణంలో దీనికి సంభంధించి ఏర్పాట్లు జరిగాయి. ఈసారి వారి వేడుకలో రక్తదానం, అన్నదానం, వస్త్రదానం వంటి సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. బాలకృష్ణ తాజాచిత్రం 'పాండురంగడు'లో ఆయన నటనకు ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుండటంతో వారి ఆనందం రెట్టింపయ్యింది.

బాలకృష్ణ తన 48వ పుట్టినరోజు సందర్భంగా సగర్వంగా... తన తండ్రి ఎన్టీయార్‌ తర్వాత ఈ తరంలో ఆయన పోషించిన జానపద, పౌరాణిక పాత్రలు వేయగల సత్తా తనకే ఉందంటున్నారు. హైదరాబాద్‌లో బాలయ్య అభిమాన సంఘాలు భారీ స్థాయిలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నాయి. ఇలాగే మరెన్నో పుట్టినరోజులు బాలకృష్ణ జరుపుకోవాలని దట్స్ తెలుగు హృదయపూర్వకంగా కోరుకుంటోది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X