బర్త్ డే బేబి: రామానాయుడు

' పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు' అని రామానాయుడు అన్నారు. కాక పోతే మొదట్నుంచి అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తిగా, తనకి చేతనైనంత సహాయం చేస్తానని పేర్కొన్నారు. ఫిల్మ్ మేకింగ్‌పై మంచి పట్టు ఉన్న రామనాయుడు తాజాగా శ్రీకాంత్, చార్మి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ఒక చిత్రన్ని నిర్మిస్తున్నారు.ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదు. ఈ చిత్రం గురించి రామానాయుడు మాట్లాడుతూ 'ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టైటిల్ డిస్కషన్‌లో ఉన్నాము. మరో రెండు రోజుల్లో ప్రకటిస్తాము అన్నారు.
నా సంస్థలో రూపొంధించిన చిత్రాలు అన్ని వర్గాలవారు చూసే విధంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలానే ఉంటుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి. రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్త అయ్యింది. ఈ చిత్రనికి కోటి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో గౌరీ ముంజాల్ మరో హీరోయిన్. ఆయన ఇలానే మరిన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ సినిమాలు తీస్తూండాలని దట్స్ తెలుగు కోరుకుంటోంది ...


Click it and Unblock the Notifications











