Sharwanand బర్త్ డే రోజు శర్వానంద్ గుడ్ న్యూస్ - తండ్రిగా ప్రమోషన్.. బేబీ పేరేంటో తెలుసా?

టాలీవుడ్‌ హీరో శర్వానంద్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఆయనో గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రిగా ప్రమోషన్​ పొందినట్లు పేర్కొన్నారు. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ షాక్ అండ్ సర్​ప్రైజ్​ అవుతున్నారు. కాస్త డిఫరెంట్​గా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్‌ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ హీరోగా పేరొందిన ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయనకు సరైన హిట్​ పడలేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించలేకపోయాయి. అయితే ఆ తర్వాత నటించిన ఒక ఒక జీవితం కంటెంట్​ పరంగా మంచి టాక్ తెచ్చుకుంది.

Happy Birthday Tollywood hero sharwanand blessed baby girl post goes viral See The Details Here

ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే గతేడాది జూన్ 3న రక్షితారెడ్డిని ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్​గానే జరిగింది. జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు సాగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా పవర్ స్టార్​ రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి వధూవరులను ఆశ్వీర్వదించారు.

అయితే నేడు ఆయన పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలానే శర్వా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా ఓ షాకింగ్ అండ్ సర్​ప్రైజ్ విషయాన్ని చెప్పారు శర్వా. తాను - రక్షితా రెడ్డి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసి తెలిపారు. తమ ముద్దుల పాపకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. తనకు లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

Happy Birthday Tollywood hero sharwanand blessed baby girl post goes viral See The Details Here

ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు శర్వాకు కంగ్రాట్స్​ చెబుతున్నారు. శర్వాకు పెళ్లి గతేడాది జూన్​ 3న జరిగింది. అంటే పెళ్లైనా 9 నెలలకే తండ్రి అయ్యారు. కాగా గతేడాది నవంబర్‌లో రక్షితా రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఈ విషయాన్ని ఈ జంట అస్సలు బయట పెట్టలేదు. ఎక్కడా బయట పెట్టకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా బిడ్డ పుట్టినట్లు చెప్పి సర్​ప్రైజ్ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం శర్వా చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, అభిలాష్​ రెడ్డి, రామ్ అబ్బరాజుతో సినిమాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X