ఆ హీరోతో త్రిష డేటింగ్.. పతిత అని తిట్టి పెళ్లి క్యాన్సిల్ చేశాడు.. లీకులతో సెన్సేషన్

By Manoj

వయసు పెరిగినా వన్నె తరగని హీరోయిన్లలో త్రిషా కృష్ణన్ ఒకరు. దక్షిణాది భాషల్లో ఆమె పలు హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ ఆమె కుర్రహీరోయిన్లకు పోటీగా సక్సెస్‌లను అందుకొంటున్నారు. మే 3వ తేదీ త్రిషా బర్త్ డే.. ఈ సందర్భంగా త్రిషా గురించిన రికార్డులు.. వివాదాలు కొన్ని మీకోసం..

Recommended Video

Actress Trisha Krishnan Grand Entry Into Tik Tok, Here Is The First video
 టాలీవుడ్‌లో ఆ అరుదైన రికార్డు త్రిషకే దక్కింది

టాలీవుడ్‌లో ఆ అరుదైన రికార్డు త్రిషకే దక్కింది

ప్రభాస్‌తో చేసిన ‘వర్షం', ఆ వెంటనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కూడా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. యంగ్ హీరోలతో పాటు చిరు, బాలయ్య, నాగ్, వెంకీతోనూ ఆడిపాడింది. దీంతో రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా రికార్డులకెక్కింది.

పతిత అని తిట్టి నిశ్చితార్థం క్యాన్సిల్ చేశాడు

పతిత అని తిట్టి నిశ్చితార్థం క్యాన్సిల్ చేశాడు

2015లో తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ సమయంలో వరుణ్.. త్రిషను ఉద్దేశించి ట్విట్టర్‌లో ‘పతిత' అని చేసిన కామెంట్ ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.

హీరోలతో డేటింగ్.. సుచీ లీక్స్‌తో సంచలనం

హీరోలతో డేటింగ్.. సుచీ లీక్స్‌తో సంచలనం

సాధారణంగా హీరోయిన్లపై ఎన్నో రూమర్లు ప్రచారం అవుతుంటాయి. అలాగే, త్రిష సినీ కెరీర్‌లో చాలా మంది హీరోలతో ఆమెకు ముడిపెడుతూ పుకార్లు షికార్లు చేశాయి. మొదట ఆమె ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రానాతో డేటింగ్ చేస్తుందన్నారు. సరిగ్గా అప్పుడే సుచీ లీక్స్‌లో రానా, త్రిషకు ముద్దు పెడుతున్న ఫొటో రావడం సంచలనం అయింది.

 త్రిష చేసిన ట్వీట్‌తో రచ్చ.. పోలీసులు ఎంట్రీ

త్రిష చేసిన ట్వీట్‌తో రచ్చ.. పోలీసులు ఎంట్రీ

త్రిష.. జంతువులకు సంరక్షణకు సంబంధించిన ‘పెటా' అనే ఆర్గనైజేషన్‌కు అంబాసీడర్‌గా నియమితురాలైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆమె తమిళనాడు ఫేమస్ ఆట జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. దీంతో ఇది పెద్ద రచ్చ అయింది. ఆ ట్వీట్ వల్ల ఎంతో మంది త్రిషపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి కాపలా కాయాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X