twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం లేదనకుంటా. మాటల రచయితగా సినిమా రంగంలో ప్రవేశించి...మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకోవడమే కాదు, రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగి...రచయితల వర్గానికి స్టార్ ఇమేజ్ తెచ్చిన ఘనత ఆయనదే.

    1999లో వచ్చిన స్వయంవరం చిత్రం ద్వారా మాటల రచయితగా తెరంగేట్రం చేసిన త్రివిక్రమ్... చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మళ్లీశ్వరి, అతడు చిత్రాలకు ఉత్తమ మాటల రచయితగా పలు అవార్డులు అందుకున్నారు. నవ్వే నువ్వే చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ 'అతడు' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.

    పంచ్ డైలాగ్ అయినా, సెంటిమెంటు డైలాగ్ అయినా, యాక్షన్ డైలాగైనా త్రివిక్రమ్ శైలి విభిన్నంగా...ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇటీవల అత్తారింటికి దారేది చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు త్రివిక్రమ్. వందకోట్ల సినిమాని తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 42వ పుట్టినరోజు. నవంబర్ 7, 1971లో భీమవరంలో జన్మించిన ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయాలని ఆకాంక్షిద్దాం.

    త్రివిక్రమ్ సినిమాల్లోని డైలాగులు...

    అతడు
    మహేశ్ : నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
    మహేశ్ :నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.
    మహేశ్ :నువ్వడిగావు కాబట్టి చెప్పలేదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
    త్రిష: వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం కావాలంట...
    గిరిబాబు: దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ ని ఇచ్చావా?
    త్రిష: బయట ఉన్న చపాతీ మొహాలు కావాలి, ఇంట్లో ఉన్న పూరీ మాత్రం అక్కర లేదు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం: వాడంటే తెలివిగల వాడు కాబట్టి పెళ్ళి కాక ముందే ఆడాళ్ళు అందంగా ఉండరని తెలుసుకొన్నాడు. మా పెళ్ళాలు అందంగా ఉన్నారా, మాకు కాలా పెళ్ళిళ్ళూ, మేం చేయట్లేదా కాపురాలు?
    మహెష్ : ఇల్లు ఇంత బాగుంటదని తెలిదు, తెలిస్తే ఎప్పుడో వచ్చే వాడిని.
    మహేష్: గన్ చూడాలనుకో తప్పులేదు బులెట్ చూడలనుకోకు చచ్చిపోతావ్

    నువ్వు నాకు నచ్చావ్
    ప్రకా ష్ రాజ్ :- ఇంతకు నీకు ఎమోచ్చు.......
    వెంకీ:- నాకు ఈత వచ్చు సారు....
    ప్రకా ష్ రాజ్ :- అదీకాదు బ్రతకటానికి ఎమోచ్చు......
    వెంకీ:- బొమ్మలు గీస్తానండి.....
    ప్రకా ష్ రాజ్ :- ఎక్కడా రోడ్డుమీదా....బోర్డుమీదా....
    వెంకీ:- పేపర్ మీద సార్....
    వెంకీ: దణ్ణం పెట్టుకొంటున్నారా?
    ఎం. ఎస్. నారాయణ: నువ్వన్నం పెట్టుకో బాబు!
    వెంకీ: ప్రార్థనా? తప్పదా!
    ఎం. ఎస్: ఏ రాదా?
    వెంకీ: నా ప్రార్థన మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు......
    ఎం. ఎస్. నారాయణ: కొత్తగా కాదు .... చాలా చెత్తగా వినిపించింది.....
    వెంకీ: మీరేం చేస్తుంటారు?
    ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.
    ఎం. ఎస్. నారాయణ: ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అని మాటిమాటికీ అడగొద్దు.. ఏదో ఒకటి చేసేయగలను.
    హేమ: మీరా దిక్కుమాలిన ముక్కలను పక్కన పడేసి వస్తే నేను మీ కాళ్ళకి దణ్ణం పెట్టుకొంటాను
    ఎం. ఎస్: పిచ్చిదానా! కాళ్లకి దణ్ణం పెట్టుకోవటానికి చేతిలో ముక్కలని ఎందుకే పడేయటం, ఇవిగో కాళ్ళు, విచ్ఛలవిడిగా పెట్టుకో దణ్ణాలు.
    ఎం. ఎస్. నారాయణ: అమ్మా .. నీ కళ్ళు ఎక్కడికి పోయాయ్?
    సునీల్ : ఆవిడే పోయి 20 సంవత్సరాలు అయ్యింది.
    బాధలో ఉన్న వాడిని బావున్నావా అని అడగటం అవివేకం... బాగున్నవాడిని ఎలా ఉన్నావ్ అని అడగటం అనవసరం..

    మల్లీశ్వరి
    వెంకీ: మల్లీశ్వరిని మీరు పని మనిషంటున్నారు, నేను పని తెలిసిన మనిషి అంటాను.
    కత్రినా: నీకు అసలు బుద్ది లేదా?
    వెంకీ:ఉంది.కాని ఎక్కువగా వాడను.
    వెంకీ: పద్దూ.......... వద్దు
    ఆ అమ్మాయి అడగాలే గాని సినిమా కేంటయ్యా స్మశానానికైనా వెళ్తాను...

    జల్సా
    బెదిరింపుకి భాష అక్కర లేదు యాస ఛాలు
    సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
    ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
    వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
    పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పని చేసింది.
    నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
    నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
    యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.
    అమ్మయిలు జూబ్లి గిల్ల్స్,బంజారా హిల్స్ క ఉండకూడదు ఎవడు పడితే వాడు వచేస్తాడు ,ఎవేరేస్ట్ లాగా ఉండాలి

    English summary
    Trivikram Srinivas is an Indian film, dialogue writer turned screenwriter and film director in Telugu Cinema. Srinivas has won the Andhra Pradesh State Nandi Award for Best Dialogue Writer five times for his dialogues in blockbuster films Chiru Navvutho, Nuvvu Naaku Nachav, Nuvve Nuvve, Malliswari, Manmadhudu, and Athadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X