»   » బర్త్ డే స్పెషల్: త్రివిక్రమ్ గురించిన ఆసక్తికర విషయాలు.....

బర్త్ డే స్పెషల్: త్రివిక్రమ్ గురించిన ఆసక్తికర విషయాలు.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ శ్రీనివాస్... తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. రచయితగా అతి తక్కువ కాలంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తనకంటూ ఓ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నారు.

తెలుగు సినిమా రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న రచయితగా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించారు ఒకప్పుడు. కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి తెలుగు రచయిత ఆయన మాత్రమే. పంచ్ డైలాగులు, ప్రాస డైలాగులు మాత్రమే కాదు.... జీవిత సత్యాలను ఆకట్టుకునేలా డైలాగుల రూపంలోకి మార్చి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడం ఆయనకే చెల్లింది.

నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌ఇండియా ఫిల్మీబీట్ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ.....ఆయన గురించిన కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం.

త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పూర్తి పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్‌. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. 1971 నవంబర్ 7న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 44. త్రివిక్రమ్ చదువంతా భీమవరంలోనే సాగింది. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. అంతేకాదు గోల్డ్‌మెడలిస్ట్‌ కూడా. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు.

సినీఫీల్డ్ లోకి...

సినీఫీల్డ్ లోకి...

సాహిత్యంపై ఉన్న అభిరుచే త్రివిక్రమ్‌ను సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేయించింది. రచయితగా ఇక్కడ ఆయన ప్రయాణం మొదలైంది. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సునీల్, పోసానిలతో

సునీల్, పోసానిలతో

హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సునీల్‌తో కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు త్రివిక్రమ్. ఇద్దరూ ఒకే ఊరి వారు కావడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం త్రివిక్రమ్ అప్పట్లో ప్రముఖ రచయితగా తన హవా కనసాగిస్తున్న పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా పనిచేశారు.

రైటర్‌గా

రైటర్‌గా

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేసిన తొలి చిత్రం ‘స్వయంవరం'. తొలి చిత్రంతో మంచి పేరు రావడంతో ‘నువ్వేకావాలి', ‘చిరునవ్వుతో..', ‘నిన్నే ప్రేమిస్తా', ‘నువ్వునాకు నచ్చావ్‌', చిత్రాలకు డైలాగ్స్ రాసారు. ఈ చిత్రాల తర్వాత ‘నువ్వే నువ్వే' సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి విజయం సాధించినా....ఎందుకనో మరో మూడేళ్ల వరకు దర్వకుడిగా అవకాశం రాలేదు. ఈ గ్యాపులో ఆయన వాసు, నమ్మథుడు, ఒక రాజు ఒక రాణి, మళ్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు రచయితగా పని చేసారు. చిరు నవ్వుతో చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

దర్శకుడిగా

దర్శకుడిగా

మహేష్ బాబుతో ‘అతడు' సినిమా చేసినప్పటి నుండి త్రివిక్రమ్ బయటి చిత్రాలకు మాటలు రాయడం మానేసారు. అయితే మధ్యలో పవన్ కళ్యణ్ తీన్మార్ చిత్రం కోసం డైలాగులు రాసారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు తర్వాత జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు వచ్చాయి. ఇందులో ఖలేజా మినహా మిగతా చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి.

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...... ఫోటోల కోసం క్లిక్ చేయండి

ప్రస్తుతం

ప్రస్తుతం

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ ఇటీవలే ఈచిత్రం ప్రారంబోత్సవం జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

అతడితో చేయడేమో?

అతడితో చేయడేమో?

త్రివిక్రమ్ హర్ట్ అయ్యాడు, ఎప్పటికీ ఆ నిర్మాతతో చేయడేమో?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అదిరిపోయే డైలాగ్స్

అదిరిపోయే డైలాగ్స్

త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన కొన్ని సూపర్ డైలాగ్స్..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Trivikram Srinivas turns 44 today. Trivikram Srinivas is an Indian film screenwriter, dialogue writer, and director known for his works exclusively in Telugu cinema, and screwball comedy films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu