twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Venkatesh: వెంకటేష్ ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా? టాలీవుడ్‌లో ఎవరికీ దక్కని రికార్డు ఆయనదే

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరిలోనూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. దిగ్గజ నిర్మాత మూవీ మొఘల్ డీ రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. ఏజ్ బార్ అయిన తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో (డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టినరోజు జరుపుకుంటోన్నారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం ఆస్తులు, ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు మీకోసం!

    అదే వెంకీ గురువు.. అలా పరిచయం

    అదే వెంకీ గురువు.. అలా పరిచయం

    ఇష్టం లేకపోయినా తండ్రి ప్రోద్బలంతో హీరోగా పరిచయం అయ్యాడు వెంకటేష్. ఇందులో భాగంగానే సినిమాల్లోకి వచ్చే ముందు అద్దాన్నే గురువుగా భావించి.. తనలోని నటనను మెరుగు పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే 1986లో 'కళియుగ పాండవులు' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంకీ హైలైట్ అయ్యాడు.

    Akhanda: బడా సంస్థ చేతికి హిందీ డబ్బింగ్ రైట్స్.. బాలయ్య పాత్రను బాలీవుడ్‌లో ఎవరు చేస్తారంటే!Akhanda: బడా సంస్థ చేతికి హిందీ డబ్బింగ్ రైట్స్.. బాలయ్య పాత్రను బాలీవుడ్‌లో ఎవరు చేస్తారంటే!

    ఫ్లాపులతో సతమతం.. విక్టరీ స్పెషల్

    ఫ్లాపులతో సతమతం.. విక్టరీ స్పెషల్

    'కళియుగ పాండవులు' తర్వాత వచ్చిన మూడు నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయలేదాయన. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ... సరైనా ఫలితాలను రాబట్టాడు. ఫలితంగా విక్టరీ అనే బిరుదును ఇంటి పేరులా మార్చుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో హవాను చూపించాడు.

    అలాంటి సినిమాలతో వాళ్లకు చేరువ

    అలాంటి సినిమాలతో వాళ్లకు చేరువ

    ఆరంభంలో ఎలివేషన్ ఉన్న సినిమాల్లో నటించిన వెంకటేష్.. క్రమక్రమంగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలనూ చేశాడు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగానూ పేరు సంపాదించుకున్నాడు. ఇవన్నీ వెంకటేష్‌ క్రేజ్‌ను బాగా పెంచేశాయని చెప్పొచ్చు.

    Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

    అంత సక్సెస్ రేటు ఉన్న ఏకైక హీరో

    అంత సక్సెస్ రేటు ఉన్న ఏకైక హీరో

    విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ప్రవేశించి 35 ఏళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన దాదాపు 80 చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఏ హీరోకూ సక్సెస్ రేటు లేదనే చెప్పాలి. ఇక, ఆయన కెరీర్‌లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకోవడంతో పాటు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు.

    వెంకటేష్‌కు మాత్రమే సొంతమైంది

    వెంకటేష్‌కు మాత్రమే సొంతమైంది

    తెలుగులో మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్. ఆయన ఇటీవలి కాలంలోనే మహేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌‌తో 'గోపాల గోపాల', రామ్‌తో 'మసాలా', వరుణ్‌ తేజ్‌తో 'F2' అండ్ 'F3', నాగ చైతన్యతో 'వెంకీ మామ' అనే సినిమాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో కూడా తెలుగులో ఇన్ని మల్టీస్టారర్ చిత్రాలు చేయలేదనే చెప్పాలి.

    Bigg Boss Winner: తొలిరోజు షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఇదే కంటిన్యూ అయితే అతడే విన్నర్Bigg Boss Winner: తొలిరోజు షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఇదే కంటిన్యూ అయితే అతడే విన్నర్

    వెంకటేష్ ఆస్తులు ఎన్ని వేల కోట్లు?

    వెంకటేష్ ఆస్తులు ఎన్ని వేల కోట్లు?

    బడా నిర్మాత కుమారుడిగా పరిచయమైన వెంకటేష్‌కు ప్రస్తుతం దాదాపు రూ. 25 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో రెండు వేల కోట్లు ఉంటాయట. వీటితో పాటు ఇళ్లు, కార్లు ఇలా మొత్తం మీద ఆయనకు రూ. 4000 కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఇందులో చాలా వరకూ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో పెట్టారని టాక్.

    ఒక్క సినిమా రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్క సినిమా రెమ్యూనరేషన్ ఎంత?

    విక్టరీ వెంకటేష్ బడా నిర్మాత కుమారుడు కావడంతో ఎక్కువ శాతం సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేశాడు. వాటికి రెమ్యూనరేషన్ తీసుకోకున్నా లాభాల్లో వాటాలు తీసుకునేవాడట. ఇక, వేరే చిత్రాలకు మాత్రం రెమ్యూనరేషన్ కానీ, పంపిణీ హక్కులు కానీ తీసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాకు వెంకటేష్ రూ. 8 -10 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!

    Recommended Video

    Jeethu Joseph About Screen Writing | Drushyam 2
    వరుస సినిమాలతో వెంకీ దూకుడు

    వరుస సినిమాలతో వెంకీ దూకుడు

    ఈ మధ్య కాలంలో వెంకటేష్ యమ ఫామ్‌లో ఉన్నారు. 2017లో వచ్చిన 'గురు' నుంచి వరుసగా 'ఎఫ్2', 'వెంకీ మామ', 'నారప్ప', 'దృశ్యం 2' ఇలా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'ఎఫ్3' మూవీ చేస్తున్నారు. వీటితో పాటు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను చేస్తున్నారు. అలాగే ఓ బాలీవుడ్ మూవీలోనూ నటించబోతున్నారు.

    సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న విక్టరీ వెంకటేష్ మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. వెంకీ మామకు తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Senior Hero Daggubati Venkatesh Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know His Assets and Remuneration Details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X