HBD Venkatesh: వెంకటేష్‌కు వేల కోట్ల ఆస్తులు.. ఏ స్టార్‌కూ లేని రికార్డు.. స్టూడియోలో వాటా ఎంతంటే!
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్నాడు విక్టరీ వెంకటేష్. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ అలరించాడు. ఈ మధ్య కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో (డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టినరోజు జరుపుకుంటోన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు మీకోసం!

అద్దాన్నే గురువుగా చేసుకుని
అందరిలా వెంకటేష్ ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. తండ్రి కోరిక మేరకు ఆయన అద్దాన్నే గురువుగా భావించి.. తనలోని నటనా నైపుణ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 1986లో 'కళియుగ పాండవులు' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంకటేష్‌కు అదిరిపోయే ఎంట్రీ సొంతమైంది.

విక్టరీనే ఇంటి పేరు చేసుకుని
'కళియుగ పాండవులు' తర్వాత వెంకటేష్ చేసిన మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. తద్వారా సరైనా ఫలితాలను రాబట్టాడు. ఫలితంగా విక్టరీనే ఇంటి పేరులా మార్చుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో హవాను చూపిస్తూ సత్తా చాటాడు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరై
కెరీర్ ఆరంభంలో ఎలివేషన్ ఉన్న సినిమాల్లో నటించిన వెంకటేష్.. తర్వాత ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలనూ చేశాడు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ వెంకటేష్ క్రేజ్‌ను బాగా పెంచేశాయని చెప్పుకోవచ్చు.

భారీ సక్సెస్ రేటు ఉన్న హీరో
విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ప్రవేశించి 35 ఏళ్లు దాటాయి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన దాదాపు 80కి పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఏ హీరోకూ సక్సెస్ రేటు లేదనే చెప్పాలి. ఇక, ఆయన కెరీర్‌లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుని ఎన్నో రికార్డులు కూడా సాధించాడు.

అరుదైన రికార్డు వెంకటేష్‌దే
తెలుగులో వెంకటేష్ మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇటీవలి కాలంలోనే మహేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌తో 'గోపాల గోపాల', రామ్‌తో 'మసాలా', వరుణ్ తేజ్‌తో 'F2' అండ్ 'F3', నాగ చైతన్యతో 'వెంకీ మామ' చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో కూడా చేయని విధంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత అందుకున్నాడు.

వెంకీ ఆస్తుల విలువ ఎంత?
టాప్ ప్రొడ్యూసర్ కుమారుడిగా వచ్చిన వెంకటేష్‌కు ప్రస్తుతం దాదాపు రూ. 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో ఐదు వందల కోట్లు ఉంటాయట. వీటితో పాటు ఇళ్లు, కార్లు, ఫ్లాట్లు ఇలా మొత్తం మీద ఆయనకు రూ. 2200 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అలాగే, ఫిల్మ్ స్టూడియోలలో కూడా సగం వాటా ఉందని టాక్.

రెమ్యూనరేషన్ ఇలా.. బ్రేకిచ్చి
వెంకటేష్ సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేశాడు. వాటికి రెమ్యూనరేషన్ తీసుకోకున్నా లాభాల్లో వాటాలు తీసుకునేవాడట. ఇక, వేరే చిత్రాలకు మాత్రం రెమ్యూనరేషన్ కానీ, పంపిణీ హక్కులు కానీ తీసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాకు వెంకీ రూ. 8 -10 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు ఆయన సినిమాకు గ్యాప్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న విక్టరీ వెంకటేష్ మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. వెంకీ మామకు తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











