twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ బర్త్ డే స్పెషల్ (అరుదైన ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఎదిగిన వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. 1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన వెంకీ...గత 27 సంవత్సరాలుగా టాలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 13, 1960లో జన్మించిన ఆయన నేటితో 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

    ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, ఆయన కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలం లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు, చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. కొన్ని పరాజయాల తర్వాత మొదటి విజయం బొబ్బిలి రాజా రూపంలో లభించింది.

    ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నారు. వెంకీ సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.

    తండ్రి పేరు నిలబెట్టిన కొడుకు

    తండ్రి పేరు నిలబెట్టిన కొడుకు


    సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడైన వెంకటేష్ వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివారు.

    వెంకటేష్

    వెంకటేష్


    తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి వెంకటేష్ చిన్నతనంలో....

    వెంకటేష్ పిల్లలు

    వెంకటేష్ పిల్లలు


    వెంకటేష్‌కు నలుగురు సంతానం. వారి పేర్లు హయవాహిని, ఆశ్రిత, భావన, అర్జున్ రామనాథ్.

    టాప్ హీరోస్

    టాప్ హీరోస్


    ఒకప్పుడు తెలుగు నాట టాప్ హీరోలుగా వెలిగిన వారిలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, హీరోయిన్ శ్రీదేవి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

    సినిమాల్లోకి రాకముందు....

    సినిమాల్లోకి రాకముందు....


    వెంకటేష్ సినిమాల్లోకి రాకముందు వీలైనప్పుడల్లా తమ సురేష్ ప్రొడక్షన్ పనులు చూసుకునే వారు.

    నాగ్, వెంకీ

    నాగ్, వెంకీ


    నాగార్జున, వెంకటేష్ చిన్నతనంలో ఇలా. వీరిద్దరు బంధువులు కూడా. వెంకటేష్ సోదరిని లక్ష్మిని నాగార్జున వివాహమాడారు. అయితే తర్వాత నాగార్జున-లక్ష్మి విడిపోయారు.

    పవన్ కళ్యాన్‌తో...

    పవన్ కళ్యాన్‌తో...


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వెంకటేష్. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

    సల్మాన్ ఖాన్

    సల్మాన్ ఖాన్


    బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో వెంకటేష్. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా తీసిన ఫోటో ఇది.

    వెంకటేష్, రాణా

    వెంకటేష్, రాణా


    బాబాయ్ వెంకటేష్‌తో కలిసి రాణా. ఇద్దరూ కలిసి త్వరలో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గత సంవత్సరం వచ్చిన కృష్ణం వందేజగద్గురుమ్ చిత్రంలో ఇద్దరూ కలిసి ఓ పాటలో నటించారు.

    అల్లు అర్జున్ వివాహం సందర్భంగా..

    అల్లు అర్జున్ వివాహం సందర్భంగా..


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వివాహం సందర్బంగా వెంకటేష్ హాజరైనప్పటి దృశ్యం. పక్కనే మెగాస్టార్ చిరంజీవి.

    English summary
    Tollywood actor Victory Venkatesh turns 53 today. Born in 1960 into the family of movie moghul Dr. D.Ramanaidu, Venkatesh grew up in Chennai and completed his schooling there. He made his movie debut with the film ‘Kaliyuga Pandavulu’ in 1986 and has quickly established himself as one of the top heroes of the Telugu Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X