బాలయ్య కెరీర్లో కేక పెట్టిన సినిమాలు ఇవే (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: బాలకృష్ణ అభిమానులకు ఈ రోజు నిజంగా పండగరోజే. ఎందుకంటారా ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు. 55వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న జన్మించారు. మహా నటుడు నందమూరి తారక రామారావు వారసత్వంతో హీరోగా తెరంగ్రేటం చేసినా.... నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బాలయ్య.

నటుడిగా నాలుగు దశాబ్ధాల ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన వందో సినిమాకి చేరువలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో 99వ సినిమాగా ‘డిక్టేటర్' చేస్తున్నారు. దీని తర్వాత తన కెరీర్లో 100వ ప్రతిష్టాత్మక సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నారు.

బాలయ్య కెరీర్లోనే ‘సింహా', ‘లెజెండ్' లాంటి భారీ విజయాలు అందించిన బోయపాటికే తన 100వ సినిమా అవకాశం ఇచ్చారు బాలయ్య. ఈ చిత్రాన్ని ‘లెజెండ్' చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వన్ ఇండియా, ఫిల్మీబీట్ తరుపున శుభాకాంక్షలు తెలుపుతూ....బాలయ్య కెరీర్లో హిట్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

మంగమ్మ గారి మనవడు

మంగమ్మ గారి మనవడు


బ్యానర్ : భార్గవ్ ఆర్ట్స్, డైరక్టర్ : కోడి రామకృష్ణ, నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి, విడుదల సంవత్సరం: 1984. సినిమా శ్లాబ్‌లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో విడుదలైన ఆ సినిమా సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది. 500 రోజులు ప్రదర్శితమై ఎన్టీఆర్ వారసుడి సత్తా ఏంటో తెలియజేసింది.

అనసూయమ్మగారి అల్లుడు

అనసూయమ్మగారి అల్లుడు


బ్యానర్ : రామకృష్ణ స్టూడియోస్, డైరక్టర్: కోదండ రామిరెడ్డి, నిర్మాత : నందమూరి జయకృష్ణ, విడుదల సంవత్సరం: 1986. హోమ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. పొగరుమోతు అత్త తో అల్లుడు సవాల్ తో నడిచే ఈ చిత్రం ఇప్పటికీ బాలయ్య అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. బాలయ్యలోని స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద తేల్చి చెప్పిన చిత్రం ఇది.

సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం


బ్యానర్ : యువ చిత్ర వారి, డైరక్టర్ : జంథ్యాల, నిర్మాత : కె.మురారి, విడుదల సంవత్సరం: 1987. 1986-87లో బాలకృష్ణ వరసగా భాక్సాఫీస్ వద్ద 5 హిట్స్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసారు. దేశోధ్దారకుడు, అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు. ఇక సీతారామ కళ్యాణం చిత్రం..ఫ్యాన్స్ కు అతీతంగా అందరూ చూసి ఆనందించారు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అందించారు. రాళ్ళల్లో ఇసుకల్లో పాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంటుంది.

ముద్దుల మామయ్య

ముద్దుల మామయ్య


బ్యానర్ : భార్గవ, ఆర్ట్స్ డైరక్టర్ : కోడి రామకృష్ణ, నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి, విడుదల సంవత్సరం: 1989. తమిళ రీమేక్ గా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ముద్దుల మామయ్య. ఎన్టీఆర్ రక్త సంభందం లాంటి అన్న -చెల్లెళ్ళ సెంటిమెంట్ ని బలంగా చూపిన ఈ చిత్రం బాలయ్యకు ఫెరఫెక్ట్ ఫిల్మ్ గా రికార్డులు క్రియేట్ చేసి నిలిచిపోయింది.

ఆదిత్యా 369

ఆదిత్యా 369


బ్యానర్ : శ్రీదేవి ఆర్ట్ మూవీస్, డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత : అనిత ప్రసాద్, విడుదల సంవత్సరం: 1991. మాస్ హీరోకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బాలయ్య...ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఒప్పుకోవటం అందరికీ ఆశ్చర్యం. ముఖ్యంగా ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయులు గెటప్ ఎవరూ మర్చిపోలేరు. జానవులే.., రాసలీల వేళ పాటలు అప్పట్లో మెగా హిట్.

రౌడీ ఇన్సపెక్టర్

రౌడీ ఇన్సపెక్టర్


బ్యానర్ : విజయలక్ష్ణి ఆర్ట్ మూవీస్, డైరక్టర్ : బి . గోపాల్, నిర్మాత : టి. త్రివిక్రమరావు, విడుదల సంవత్సరం: 1992. ఎన్టీఆర్ తో జస్టిస్ చౌదరి వంటి హిట్ ఇచ్చిన బ్యానర్ లో బాలయ్య చేసిన సినిమా ఇది. అంతకు ముందు లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన బి.గోపాల్ తో చేసిన ఈ చిత్రం సంచలన విజయం సాథించింది. ఎక్కడ విన్నా ఈ పాటలే వినపడేవి. విజయశాంతి కూడా ఈ సినిమాలో అదరకొట్టింది.

భైరవ ద్వీపం

భైరవ ద్వీపం


బ్యానర్ : చందమామ విజయ కంబైన్స్, డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత : బి.విశ్వనాథ రెడ్డి, విడుదల సంవత్సరం: 1994. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో ఆణిముత్యాలు అందించిన "విజయ" బ్యానర్ అంటే తెలియదు. వారు చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత చేసిన చిత్రం ఇది. జానపద చిత్రం గా వచ్చిన ఈ చిత్రం బాలయ్య ఎలాంటిపాత్ర కైనా ప్రాణం పోస్తాడని ప్రూవ్ చేసింది.

సమర సింహా రెడ్డి

సమర సింహా రెడ్డి


బ్యానర్ : శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్, డైరక్టర్ : బి.గోపాల్, నిర్మాత : చంగల వెంకట్రావు, విడుదల సంవత్సరం: 1999. బాలకృష్ణ పని అయిపోయింది...అనుకున్న టైమ్ లో మిస్సైల్ లా దూసుకు రావటానికి దోహదం చేసిన చిత్రం ఇది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి తెలుగు సినిమా ప్రేరణ పొందుతోందంటే ఈ చిత్రం గొప్పతనం ఏమిటో ఆర్దం చేసుకోవచ్చు. రాయలసీమ ఫ్యాక్షన్స్ మీద ఓ రివేంజ్ స్టోరీని అల్లి బాలయ్య నటనతో ఘన విజయం సాధించారు.

నరసింహ నాయుడు

నరసింహ నాయుడు


బ్యానర్ : వెంకట రమణ ప్రొడక్షన్స్, డైరక్టర్ : బి.గోపాల్ నిర్మాత : మేడికొండ మురళి కృష్ణ, విడుదల సంవత్సరం: 2001 భాక్సాఫీస్ కు సెన్సేషనల్ హిట్ అనేది తెలియచేసిన చిత్రం ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్ కు కుటుంబాల పగ ను కలిసి అల్లిన ఈ కథ బాలకృష్ణ కెరీర్ లో విపరీతమైన ఊపు తెచ్చింది. చాలా కాలం తర్వాత 275 ఆడిన సినిమా ఇది.

సింహా

సింహా


బ్యానర్ : యునైటెడ్ మూవీస్, డైరక్టర్ : బోయపాటి శ్రీను, నిర్మాత : పరుచూరి కిరీటి విడుదల సంవత్సరం: 2010 బాలకృష్ణకు వరస ఫ్లాపులు..బాలయ్యతో సినిమా అంటే కష్టం అంటూ అంతా చేతులు ఎత్తేస్తున్నారు. అయితే సరైన సినిమా పడితే బాలకృష్ణ ఎప్పుడూ భాక్సాఫీస్ సింహమే...అని ప్రూవ్ చేసిన చిత్రం ఇది.

లెజెండ్

లెజెండ్


బ్యానర్: వారాహి చలన చిత్రం, దర్శకత్వం: బోయపాటి శ్రీను, విడుదల సంవత్సరం: 2014. మార్చి 28న 2014 విడుదలై.. 400 రోజులను పూర్తి చేసుకుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో తిరుగులేని రికార్డును సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X