హ్యాపీ బర్త్ డే టూ యూ......

ఇక 'వేటగాడు,గజదొంగ' వంటి సినిమాలతో కమర్షియల్ అంటే అర్థం చెప్పారాయన. అంతేగాక 'అన్నమయ్య,మంజునాధ, శ్రీరామదాసు' సినిమాలతో చారిత్రికాలు, పౌరాణికాలు తీసి యే తరహా చిత్రాలైనా తీయగలనని నిరూపించుకున్నారు. అలాగే దర్శకుడిగా తన కెరీర్‌లోనే ఓ అద్భుతమైన మ్యూజికల్ హిట్ గా నిలిచిన 'పెళ్లి సందడి' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డునందుకొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవేంద్రుడు. ప్రస్తుతం బాలకృష్ణతో 'పాండురంగడు' సినిమాను తీసి రిలీజుకు ముస్తాబు చేస్తున్న రాఘవేంద్రరావు పుట్టిన రోజు ఈ రోజు జరుపుకుంటున్నారు. ఆయన దర్శకుడిగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,తెలుగు వారిని మరెన్నో మరుపురాని చిత్రాలు అందించాలని కోరుకుంటూ..... మౌనముని కె. రాఘవేంద్రరావుకి దట్స్ తెలుగు జన్మదిన శుభాకాంక్షలు.... తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











