అప్పుడు నగ్నంగా... ఇప్పుడు మాత్రం నో
ముంబై: బ్యాగ్రౌండ్ లేని హీరోయిన్లు త్వరగా పాపులర్ కావడానికి ఎక్స్ ఫోజింగ్ రూట్‌ను ఎంచుకోవడం మామూలే. అలాంటి భామల్లో బాలీవుడ్ నటి నేహా దూపియా ఒకరు. తన తొలి చిత్రం 'జూలీ'లో నేహా దూపియా నగ్నంగా నటించి అందరి చూపులు తన అందాలపైకి తిప్పుకుంది. ఈ రోజు ఈ భామ 32వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలను పంచుకుంది.
పదేళ్లుగా బాలీవుడ్లో కొనసాగుతున్నా తాను చేసిన సినిమాలపై సంతృప్తి లేదని వెల్లడించింది. ఇంకా మంచి నటిగా నిరూపించుకునేందుకు కృషి చేస్తూనే ఉంటానని పేర్కొంది. నటనే కాదు ఏ వృత్తి అయినా సరే అంతటితో సంతృప్తి పడకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేయాలి. నేను చేయగలిగినంత చేసాను అని భావిస్తే...ఇక మీ ఎదుగుదలను మీరు అడ్డుకున్నట్లే అని చెబుతోంది.
తన తొలి సినిమా జూలీలో దేహ ప్రదర్శన(నగ్నంగా) చేసిన మాట వాస్తవమే కానీ...ఇప్పుడు మాత్రం అలాంటి పాత్రలు చేయదలుచుకోలేదు. కేవలం నటన ద్వారానే గుర్తింపు పొందాలనుకుంటున్నాను అని తేల్చి చెప్పింది. సోనూ సూద్‌తో కలిసి చివరి సారిగా 'మాక్సిమమ్' చిత్రం ద్వారా వెండి తెరపై కనిపించిన నేహా దూపియా అక్టోబర్లో విడుదల కానున్న క్రైం థ్రిల్లర్ 'రష్' ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications












