స్టార్స్ అందరితో తమన్నా హ్యాపీడేస్ హవా
తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకుంటున్న మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగులో ఈ మధ్య జోరు పెంచేసింది.. శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్" చిత్రం తర్వాత తమిళ చిత్రాల్లో తప్ప తెలుగు చిత్రాల్లో కనిపించని ఈ మిల్క్ బ్యూటీ ఈ మధ్య నాగచైతన్యతో నటించిన '100% లవ్" చిత్రంతో మళ్ళీ తెలుగు చిత్రాల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తమిళ చిత్రాలపైనే దృష్టి పెట్టిన తమన్నా ప్రస్తుతం తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం తమిళ్ లో ఒక్క సినిమా కూడా అంగీకరించని ఆమె తెలుగులో రామ్ చరణ్‌తో సంపత్ నంది రూపొందిస్తున్న 'రచ్చ" చిత్రంలోనూ అలాగే జూ ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న 'ఊసరవెల్లి" చిత్రంతో పాటు రామ్ తో ప్రేమకథా చిత్రాల దర్శకుడు ఎ. కరుణాకరన్ రూపొందిస్తున్న 'ఎందుకంటే ప్రేమంట" చిత్రాల్లో నటిస్తున్న తమన్నాకు తాజాగా గోపీచంద్ సరసన నటించే అవకాశం వచ్చిందని సమాచారం.
తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రంలో హీరో గోపీచంద్ సరసన తమన్నాని ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. దర్శకుడు భూపతి పాండ్యన్ ముందు ఈ చిత్రాన్ని విక్రమ్ తో చేయాలని ప్లాన్ చేశాడు. అయితే విక్రమ్ రెండు భారీ చిత్రాలతో బిజీగా వుండటం వల్ల భూపతిపాండ్యన్ ఆ స్క్రీప్ట్ ని గోపీచంద్ కు చెప్పడం, అది ఆయనకు నచ్చడం జరిగిపోయిందని, ఈ చిత్రాన్ని ఓ భారీ నిర్మాణ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. గోపీచంద్ తో నటించనున్న ఈ చిత్రంతో ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగు చిత్రాలుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











