తారక్ నుంచి తమన్నాకు కబురొచ్చింది
జూ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంలో తమన్నాని తీసుకోబోతున్నారని సమచారం. ఈ మేరకు తమన్నాకు ఎన్టీఆర్ ఇంతకు ముందు ప్రామిస్ చేసాడు. అనుకున్నట్లుగానే బోయపాటితో చేయబోయే చిత్రంలో ఆమెని రికమెండ్ చేసాడు. కానీ ఇప్పుడా ప్రాజెక్టు మెటీరిలైజ్ కాకపోవటంతో సురేంద్రరెడ్డితో చేసే చిత్రంలో ఆమెను తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దాంతో తమన్నా చాలా ఉత్సాహంగా ఉందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇక హ్యాపీ డేస్ తో పాపులర్ అయిన తమన్నా కి ఆ తర్వాత తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్స్ రాలేదు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం లాంటి సినిమాలు చేసినా కలిసిరాలేదు. దాంతో తమిళంకు వెళ్ళి అక్కడ విజయవంతంగా జెండా ఎగరేసింది. దాంతో ఆమె విలవ తెలిసివచ్చిన మనవాళ్ళు అర్జెంటుగా నాగచైతన్య ప్రక్కన, అల్లు అర్జున్ ప్రక్కన తీసేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆ షూటింగ్ లలో అటో డేటు ఇటో డేటు ఇచ్చి బిజీగా ఉంది. మరో ప్రక్క తమిళ హీరో కార్తీతో ప్రేమ కథ నడుపుతూ, ఖండిస్తూ మీడియాలో హంగామా చేస్తోంది.


Click it and Unblock the Notifications











