‘హ్యాపీ న్యూ ఇయర్’ చెత్త: కొడుకు మూవీకి జయ షాక్

By Bojja Kumar

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తాజా సినిమా ‘హ్యాపీ న్యూఇయర్' బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, దీపిక, అభిసేక్ బచ్చన్, బోమన్ ఇరానీ మఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీవసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో దాదాపు 237 కోట్లు వసూలుచేసి, 300 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ సినిమా తక్కువ కాలంలోనే రూ. 300 కోట్లు సాధించిన ఘనతకు అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే అమితాబ్ భార్య జయ బచ్చన్ మాత్రం షాకింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ చిత్రాన్ని పనికిమాలిన సినిమాగా పేర్కొన్నారు.

Happy New Year as a 'Nonsensical Film': Jaya Bachchan

ఇటీవలి కాలంలో తాను చూసిన పనికిమాలిన సినిమా ఇదేననీ, కేవలం తన కొడుకు అభిషేక్‌ నటించినందునే ఆ సినిమాని తాను చూశాననీ ఆమె ఆ సినిమాను ఎండగట్టారు. ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదనీ, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చురకలంటించారు. స్వయంగా జయ బచ్చన్ ఈ కామెంట్స్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.

‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ‘మైహూనా', ‘ఓం శాంతి ఓం' తర్వాత షారుక్ ఖాన్ హీరోగా లేడీ డెరైక్టర్ ఫరా ఖాన్ రూపొందించిన మూడో చిత్రమిది. ఈ సినిమాను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X