అరచి అరచి గొంతు పోయింది: వెంకటేష్
ప్రపంచకప్ ఫైనల్స్ ని వెంకటేష్ ప్రత్యక్షంగా చూసారు.ఆ సంగతుల్ని మీడియాకు వివరిస్తూ...సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలను ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. మనవాళ్లు కప్పు గెలిచిన తీరును ఎంతగానో ఆస్వాదించాను. నేనే కాదు... భారతీయులందరూ ఎప్పటికీ గుర్తుంచుకొనే మ్యాచ్ అది.ఆట పూర్తయ్యాక మన క్రికెట్ బృందంతో కలిసి గడపటం ఎప్పటికీ మరిచిపోలేను.
మ్యాచ్‌లో అరచి అరచి గొంతు బొంగురుపోయింది. ఇది నాకు గొప్ప యేడాది అన్నారు.ప్రస్తుతం వెంకటేష్ ...తేజ దర్సకత్వంలో సావిత్రి అనే చిత్రం చేస్తున్నారు.అలాగే డాన్ శీను డైరక్టర్ గోపీచంద్ మలినేని దర్సకత్వంలో మళయాళ సూపర్ హిట్ బాడీగార్డ్ రీమేక్ చేస్తున్నారు.బెల్లంకొండ సురేష్ నిర్మింస్తున్న ఈ చిత్రం ఉగాది రోజున మొదలైంది.


Click it and Unblock the Notifications











