హోమో సెక్సువల్స్ గురించి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కామెంట్!

Recommended Video

Jahnvi Kapoor Interesting Comments On Dostana 2 Movie || Filmibeat Telugu

'ధడక్' మూవీతో సినిమా రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి-బోనీ కపూర్ కూతురు జాహ్నవి కపూర్‌కు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గుంజర్ సక్సేనా బయోపిక్‌, రూహి అఫ్జా అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. కరణ్ జోహార్ రూపొందించబోయే దోస్తానా 2లో హీరోయిన్‌గా ఖరారైంది.

2008లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'దోస్తానా' మూవీ సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా 'దోస్తానా 2' ప్లాన్ చేశారు. ఇందులో జాహ్నవి కపూర్‌తో పాటు కార్తీక్ ఆర్యన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మరో హీరో ఎంపిక జరుగాల్సి ఉంది. హోమో సెక్సువాలిటీ(స్వలింగ సంపర్కం) అంశంపై జాహ్నవి చేస్తున్న తొలి చిత్రం ఇది.

హోమో సెక్సువల్స్ గురించి జాహ్నవి కపూర్

హోమో సెక్సువల్స్ గురించి జాహ్నవి కపూర్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాహ్నవి స్పందిస్తూ... ‘దోస్తానా 2 మూవీలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథ చాలా ఫన్నీగా ఉంటుంది. హోమో సెక్సువాలిటీ అనే అంశాన్ని సినిమాలో చర్చించడం మంచి మరిణామం. ఎందుకంటే అదొక సాధారణ అంశం. ప్రజల్లో దానిపై ఉన్న అపోహ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని జాహ్నవి కపూర్ తెలిపారు.

11 ఏళ్ల తర్వాత సీక్వెల్

11 ఏళ్ల తర్వాత సీక్వెల్

దాదాపు 11 ఏళ్ల తర్వాత 'దోస్తానా' సీక్వెల్ ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉండే ఈ చిత్రంలో.... కార్తీక్ ఆర్యన్, జాహ్నవి కపూర్ ఖరారయ్యారని, మరో హీరో ఫైనల్ కావాల్సి ఉందని తెలిపారు. ఈ చిత్రానికి కొల్లిని డికన్హా దర్శకత్వం వహించబోతున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బేనర్లో తెరకెక్కబోతోంది.

‘దోస్తానా' ఫ్రాంచైజీని కొనసాగిస్తాం

‘దోస్తానా' ఫ్రాంచైజీని కొనసాగిస్తాం

ఈ సినిమా గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘దోస్తానా' ఫ్రాంచైజీని కొనసాగించడం ఆనందంగా ఉంది, కార్తీక్ ఆర్యన్, జాహ్నవి కపూర్ ఫైనల్ అయ్యారు. ఇద్దరూ తెరపై దేశీ బాయ్ అండ్ గర్ల్ మ్యాడ్‌నెస్ క్రియేట్

చేయబోతున్నారు. మా ధర్మా ప్రొడక్షన్స్ బేనర్లో కార్తీక్ ఆర్యన్ చేస్తున్న తొలి చిత్రం. ఈ సినిమా ద్వారా మరో హీరోను పరిచయం చేయబోతున్నాం. త్వరలో అతడికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తాం. కొల్లిన్ డికున్హాకు సైతం దర్శకుడిగా ఇది తొలిచిత్రం' అన్నారు.

‘గే'లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధానంగా

‘గే'లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధానంగా

‘దోస్తానా 2' చిత్రం పూర్తిగా కామెడీ నేపథ్యంలో సాగుతుంది. ప్రేక్షకులకు వినోదం పంచుతూనే స్వలింగ సంపర్కులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ చిత్రంలో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. వారిపై వివక్ష చూపకుండా సాధారణంగా ట్రీట్ చేయాలనే సందేశం ఈ చిత్రం ద్వారా ఇస్తారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X