Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొణిదెల నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫస్ట్ ఇన్విటేషన్ ఇదే!
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా రూపొందుతున్న సినిమా "హ్యాపి వెడ్డింగ్". యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం చక్కటి ఫ్యామిలి ఎమోషన్స్, సున్నితమైన సన్నివేశాలు, చిలిపి గా సాగే కథనంతో దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కించాడు.
సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం(జూన్ 21) 'హ్యాపీ వెండ్డింగ్' ఫస్ట్ ఇన్విటేషన్ లాంచ్ చేశారు. థియేట్రికల్ ట్రైలర్ జూన్ 30వ తేదీ ఉదయం 10.36 గంటలకు విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
'హ్యాపీ వెడ్డింగ్' నిహారిక తెలుగులో నటిస్తున్న రెండో మూవీ. ఆమె మొదటి 'ఒక మనసు'లో నటన పరంగా మంచి మార్కులు పడ్డప్పటికీ బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్‌లో ఆమెను అల్లరి పిల్లగా చూసిన ప్రేక్షకులు...ఒక మనసు చిత్రంలో నిహారిక పాత్రకు కనెక్ట్ కాకపోవడమే ఇందుకు కారణం.
'హ్యాపీ వెడ్డింగ్' మూవీ పెళ్లిసందడి బ్యాక్ డ్రాపుతో సాగుతుంది కాబట్టి వినోదాత్మకంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడుతూ....యువి క్రియేషన్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ తొ కలసి పాకెట్ సినిమా బ్యానర్ లో చక్కటి తెలుగు చిత్రంగా మేము నిర్మించిన హ్యపివెడ్డింగ్ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితం లో ఇలాంటి అనుభవం జరిగివుంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమనితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల , అన్ని వయసుల వారు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు. అతిత్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటిస్తామనితెలిపారు.
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు. మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్, రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్, కెమెరా - బాల్ రెడ్డి, మ్యూజిక్ - శక్తికాంత్ కార్తిక్, నిర్మాత - పాకెట్ సినిమా, దర్శకత్వం - లక్ష్మణ్ కార్య.