Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్‌కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
వీడియో: పెళ్లి గురించి అడగగానే దుమ్ము దులిపేసిన నిహారిక.. ఆ తరువాత ఏం జరిగిందంటే!
Recommended Video
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తోంది. ఇప్పటికే నిహారిక ఒక మనసు చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో నిహారిక నటిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఆ మధ్యన నిహారిక పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారం జరిగాయి. ఆ వార్తలని మెగా క్యాంప్ ఖండించింది. అయినా కూడా సెలెబ్రిటీల విషయంలో ఎదో ఒక రూమర్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. మీడియాలో అవి సర్కులేట్ అవుతూనే ఉంటాయి.
కారు ఎక్కుతుండగా
నిహారిక కారు ఎక్కుతుండగా ఓ వ్యక్తి వచ్చి మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. మీ పెళ్లి గురించి అనేక రూమర్స్ ప్రచారం జరుగుతున్నాయి. వాటిగురించి స్పందిస్తారా అని అడగగా నిహారిక ఫైర్ అయిపోయింది.
నా పెళ్లి గురించి మీకెందుకయ్యా
అతడి అడిగిన ప్రశ్నకు నిహారిక చెలరేగిపోయింది. ఎవడయ్య నిన్ను లోపలకు రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా. నిహారిక ఎవరిని చేసుకుంటుంది.. ఎప్పుడు చేసుకుంటుంది.. ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్ అవుతారు షేక్ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంనైల్స్ కోసం నన్ను వాడుకుంటారా అంటూ అతడి భరతం పట్టింది.
ఊహించని ట్విస్ట్
ఆ తరువాతే తెలుస్తుంది.. ఇదంతా నిజం కాదని. మేము మీ హ్యాపీ వెడ్డింగ్ మూవీ గురించి అడుగుతున్నాం మేడం అని అతడు అంటాడు. ' సారి సారి సారి.. మళ్ళీ మళ్ళీ ఓకేనా.. మా హ్యాపీ వెడ్డింగ్ చిత్ర ట్రైలర్ ఈ నెల 30 న విడుదలవుతుంది. అప్పుడే సినిమా విడుదల గురించి కూడాచెబుతాం అంటూ నిహారిక వెళ్ళిపోతుంది.
హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్
ఇదంతా వ్యాపీ వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో. నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటిస్తున్న చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.