కట్నం వేధింపులు: హీరోయిన్ రంభపై కేసు నమోదు
హైదరాబాద్: నటి రంభపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసున నమోదు చేసినట్లు తెలుస్తోంది. అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు.
అయితే రంభ విదేశాల్లో ఉండటం వల్ల అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఫిర్యాదు చేసిన పల్లవి ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత....రంభ పేరు మళ్లీ ఈ రకంగా మీడియాలో వినిపిస్తుండటం చర్చనీయాంశం అయింది.

కెనడాలో సెటిలైన ఎన్నారై బిజినెస్‌మేన్ ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ ఏప్రిల్ 8, 2010లో వివాహ మాడిన సంగతి తెలిసిందే. తిరుపతిలో వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. ఈ దంపతుల దాంపత్యానికి గుర్తుగా జనవరి 14, 2011న ఆడ పిల్ల జన్మించింది.
2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుందని వార్తలు వెలువడ్డాయి. కానీ రంభ అప్పుడు ఈ వార్తలను ఖండించింది. భర్త ఇంద్రన్, కూతురు లావణ్యతో టోరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది. 2013లో మళ్లీ రంభ భర్తతో విడిపోయినట్లు రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇంతలోనే రంభపై కేసు నమోదు కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











