ఆ సినిమాలో... క్రికెటర్ హర్భజన్ సింగ్ గెటప్ ఇదే(ఫోటోస్)
ముంబై: టీమిండియా స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడనే విషయం ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న 'భా జీ ఇన్ ప్రాబ్లమ్' అనే పంజాబీ చిత్రంలో హర్భజన్ నటించబోతున్నాడు.
ఈ చిత్రంలో హర్భజన్ సింగ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ఆయన పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ వీక్షించవచ్చు. ఈచిత్రాన్ని గ్రాజింగ్ గోట్ పిక్చర్స్ పతాకంపై అక్షయ్ కుమార్, అశ్విని యార్డి ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మూవీలో ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఈ సినిమాకు హర్భజన్ పాత్ర కీలకం కానుందని, హీరోకు సపోర్టివ్ గా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా భజ్జీ తొలిసారిగా వెండితెరపై కనిపిస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

భాజీ ఇన్ ప్రాబ్లమ్ చిత్రంలో హర్భజన్ సింగ్.

ఈ చిత్రంలో హర్భజన్ సింగ్ పంజాబీ ఫోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని గ్రాజింగ్ గోట్ పిక్చర్స్ పతాకంపై అక్షయ్ కుమార్, అశ్విని యార్డి ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు హర్భజన్ పాత్ర కీలకం కానుందని, హీరోకు సపోర్టివ్ గా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమా విజయవంతం అయితే భజ్జీ సినిమాల్లో బిజీగా కావడం ఖాయం.
పంజాబీ యాక్టర్స్ జిప్పీ గ్రేవాల్, గుర్పీత్ తదితరులతో కలిసి హర్భజన్ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి అశ్విని యార్ది మాట్లాడుతూ.... భజ్జీ పాత్ర ఆయన అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని వెల్లడించారు. గ్రాజింగ్ గోట్ పిక్చర్స్ గతంలో 'ఓ మై గాడ్' అనే హిందీ చిత్రంతో పాటు, మరాఠీలో '72 మైల్స్' చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు 'భా జీ ఇన్ ప్రాబ్లమ్' అనే చిత్రం ద్వారా పంజాబీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది.


Click it and Unblock the Notifications











