వెండితెరకు క్యూ కడుతున్న ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్.. ఇర్ఫాన్ బాటలోనే మరో క్రికెటర్

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు వెండితెర బాట పడుతుండటం సినీ లోకంలో ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తుండగా, ఆ బాటలోనే పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా చేరారు. తాజాగా ఇప్పుడు మరో భారత క్రికెట్ జట్టు ఆటగాడు హర్భజన్ సింగ్ ఈ లిస్ట్‌లో చేరడం విశేషం.

హర్భజన్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌

హర్భజన్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌

భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్నారు. తమిళ స్టార్ కమెడియన్ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న 'డిక్కీలోనా' సినిమాతో హర్భజన్ వెండితెరపై అరంగేట్రం చెయ్యనున్నారు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ మూవీ.. హర్భజన్ సింగ్‌ రోల్

సైన్స్ ఫిక్షన్ మూవీ.. హర్భజన్ సింగ్‌ రోల్

'డిక్కీలోనా' అనే సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చిత్రయూనిట్ హర్భజన్ సింగ్‌ను సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చేశారట. గ్రౌండ్‌లో స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీసిన హర్భజన్.. థియేటర్స్‌లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి మరి.

విషయాన్ని తెలుపుతూ

విషయాన్ని తెలుపుతూ

తాను తమిళ సినిమాతో పరిచయమవుతున్నట్లు హర్భజన్ స్వయంగా ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ తన సినీ ఆరంగేట్రం సంగతి వెల్లడించారు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన ఈ ట్వీట్ చూసి.. ఆయనను సినిమాల్లోకి స్వాగతిస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Recommended Video

Irfan Pathan Set To make Acting Debut In Tamil Movie Starring Chiyaan Vikram
విక్రమ్‌ సినిమాలో ఇర్ఫాన్‌

విక్రమ్‌ సినిమాలో ఇర్ఫాన్‌

మరో భారత స్టార్ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ 'చియాన్‌' విక్రమ్‌తో కలిసి త్వరలో ఓ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో తెలిపాడు. తమిళ యువ డైరెక్టర్ అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ నటించనున్నాడు.

 ఇర్ఫాన్‌ పాత్ర ఇదే..

ఇర్ఫాన్‌ పాత్ర ఇదే..

ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషించనున్నది ఇర్ఫాన్‌ వెల్లడించలేదు. కానీ.. టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌ పఠాన్‌ కనిపించనున్నాడని సమాచారం. విక్రమ్‌ నటించే 58వ సినిమా ఇది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఇర్ఫాన్‌ పఠాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియో ట్వీట్‌ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X