సినీ నిర్మాతగా భజ్జీ(హర్భజన్‌)

By Srikanya

Harbhajan Singh
చండీగఢ్‌: క్రికెట్‌ కెరీర్‌ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో భారత ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ వేరే రంగాల వైపు చూస్తున్నట్లున్నాడు. అతను నిర్మాతగా మారి సినిమాలు నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నాడు. త్వరలోనే తన నిర్మాణంలో పంజాబీ సినిమాలు రూపొందనున్నట్లు హర్భజన్‌ స్వయంగా ప్రకటించాడు.

హర్బజన్ మాట్లాడుతూ...''బాలీవుడ్‌, పంజాబ్‌ సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో చర్చలు జరుపుతున్నా. నేను నిర్మించబోయే రెండు సినిమాలకు దర్శకులను కూడా ఖరారు చేశా. ఇవి కామెడీ సినిమాలు. భారత్‌తో పాటు విదేశాల్లోని ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటా యి'' అని భజ్జీ వెల్లడించాడు. క్రికెటర్లు వేరే ఆదాయ మార్గాలు చూసుకోవడం మామూలేనని టర్బోనేటర్‌ చెప్పాడు.

అలాగే ''ఈ రోజుల్లో చాలామంది క్రికెటర్లు కెరీర్‌ కొనసాగిస్తూనే వేరే వ్యాపారాలు చేస్తున్నారు. నేనూ అందుకు మినహాయింపు కాకూడదనుకుంటున్నా. ఐతే క్రికెట్‌కే నా తొలి ప్రాధాన్యం'' అన్నాడు. ఐతే తన నిర్మాణంలో తెరకెక్కే సినిమాల్లో తాను నటించనని చెప్పాడు. ముంబై పరిసరాల్లో కెప్టెన్ ధోనితో కలిసి భజ్జీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం.

'ఎంతో మంది భారత క్రికెటర్లు ఆటతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. నేనెందుకు వెనకే ఉండిపోవాలి. సినిమాల్లో మంచి సంపాదనకు అవకాశం ఉంది. పంజాబీ సినిమా నాకు సరైన వేదిక' అని ఈ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ కూడా ప్రముఖ నిర్మాత. ఆయన పంజాబీ భాషలో 36 చిత్రాలు నిర్మించారు.

పంజాబీ గాయకులు కొంత మంది ఇటీవల అశ్లీల సాహిత్యంతో పాటలు చేస్తున్నారని, ఇది తనను బాధించిందన్న హర్భజన్, అలాంటివి తీయొద్దని విజ్ఞప్తి చేశాడు. అందుకే పంజాబీ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే విధంగా భజ్జీ నాలుగు నిమిషాల వీడియోను రూపొందించాడు. దీనికోసం హర్భజన్ తొలి సారి పాట పాడటం విశేషం. 'ఏక్ సునేహా, మేరా సోనా పంజాబ్...' అంటూ సాగే ఈ గీతం ఇప్పుడు యు ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X