Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
క్రికెటర్ హర్బజన్ సింగ్ మూవీ ఫుల్ క్రేజ్.. ఫ్రెండ్షిప్ మూవీకి ఫ్యాన్సీ రేట్!
క్రికెట్ మైదానంలో బంతితో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త భూమికను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. తమిళ చిత్ర రంగంలోకి ప్రవేశించిన హర్భజన్ సింగ్ ఫ్రెండ్ షిప్ అనే యూత్‌ఫుల్, ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటిస్తున్నారు. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రంలో యాక్షన్ కింగ్, సీనియర్ హీరో అర్జున్ కూడా నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ వివరాల్లోకి వెళితే..
చివరి షెడ్యూల్ షూటింగ్లో
ఫ్రెండ్ షిప్ మూవీ చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీ, తదితర ప్రాంతాల్లో జరగనుంది. మాజీ మిస్ శ్రీ లంక, తమిళ బిగ్‌బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్గా నటిస్తున్నారు. జి జాంబి ఫేమ్, హీరో ఆర్యన్ గౌడ్, రంగస్థలం ఫేమ్ మహేష్, అంకిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత జే సతీష్ కుమార్ (జేఎస్కే) విలన్‌గా నటిస్తున్నారు.
రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన హక్కులు
ఇలా అనేక ప్రాముఖ్యతలతోపాటు క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఫ్రెండ్షిప్ చిత్రం హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఈ చిత్రం హక్కులను శ్రీ లక్ష్మీ జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నారు. క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉండటంతో ఫెండ్షిప్ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీగా క్రేజ్ ఏర్పడింది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఈ సందర్భంగా ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ... ఫ్రెండ్షిప్ లాంటి క్రేజీ ప్రాజెక్టును తెలుగులో రిలీజ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ బ్యాక్ డ్రాప్లో లవ్ అండ్ గ్యాంగ్ వార్ నేపథ్యంగా ఆద్యంతం ఉత్కంఠగా నడిచే ఈ చిత్రం యూత్నే కాకుండా... అందర్నీ ఉర్రూతలూగించడం ఖాయం అన్నారు.
నటీనటులు
నటీనటులు,
సాంకేతిక
వర్గం
నటీనటులు:
యాక్షన్
కింగ్
అర్జున్,
హర్బజన్
సింగ్,
లోస్లియా,
ఆర్యన్
గౌడ్,
మహేష్,
అంకిరెడ్డి,
జే
సతీష్
కుమార్
తదితరులు
మాటలు:
రాజశేఖర్
రెడ్డి
సంగీతం:
డిఎం
ఉదయ్
కుమార్
సినిమాటోగ్రఫీ:
శాంత
కుమార్
నిర్మాత:
ఏఎన్
బాలాజీ
దర్శకత్వం:
జాన్
పాల్
రాజ్
&
శ్యామ్
సూర్య