బాలీవుడ్ హాట్ లేడీతో భజ్జీ వివాహం ఖరారు
పలు ఈవెంట్లలో తరచూగా కలుస్తూ వస్తున్న ఈ ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చాలా కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ కూడా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి మీడియాతో మాట్లాడటానికి ఇష్ట పడలేదు. చివరికి పెళ్లి విషయం వచ్చినా ఇంకా తమ మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
మోడల్‌గా, ఆపై ఇ్రమాన్ హస్మి హీరోగా వచ్చిన 'ట్రైన్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గీతా బస్రా ప్రస్తుతం జిల్లా గజియాబాద్ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రంలో సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ తారల మధ్య లవ్వాయణం మొదలై పెళ్లి వరకు వెళ్లింది. సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులైన మన్సూర్ అలీఖాన్(టైగర్ పటౌడీ), షర్మిలా ఠాగూర్ 1969 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. అనంతరం అజారుద్దీన్, సంగీత బిజిలానీ 1996లో వివాహం చేసుకున్నారు. రీనా రాయ్ మరియు మౌషిమ్ ఖాన్ 1983లో పెళ్లి చేసుకున్నారు.


Click it and Unblock the Notifications












