twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ హాట్ లేడీతో భజ్జీ వివాహం ఖరారు

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హాట్ బ్యూటీ గీతా బస్రాతో క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం ఖరారైంది. త్వరలోనే ఇరు కుటుంబాల పెద్ద అంగీకారంతో ఇద్దరు ఏకం కాబోతున్నారు. ఓ ప్రముఖ పత్రిక‌లో వచ్చిన వివరాల ప్రకారం హర్భజన్, గీతా బస్రా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    పలు ఈవెంట్లలో తరచూగా కలుస్తూ వస్తున్న ఈ ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చాలా కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ కూడా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి మీడియాతో మాట్లాడటానికి ఇష్ట పడలేదు. చివరికి పెళ్లి విషయం వచ్చినా ఇంకా తమ మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

    మోడల్‌గా, ఆపై ఇ్రమాన్ హస్మి హీరోగా వచ్చిన 'ట్రైన్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గీతా బస్రా ప్రస్తుతం జిల్లా గజియాబాద్ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రంలో సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    గతంలో చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ తారల మధ్య లవ్వాయణం మొదలై పెళ్లి వరకు వెళ్లింది. సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులైన మన్సూర్ అలీఖాన్(టైగర్ పటౌడీ), షర్మిలా ఠాగూర్ 1969 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. అనంతరం అజారుద్దీన్, సంగీత బిజిలానీ 1996లో వివాహం చేసుకున్నారు. రీనా రాయ్ మరియు మౌషిమ్ ఖాన్ 1983లో పెళ్లి చేసుకున్నారు.

    English summary
    Harbhajan Singh, who has never spoken about his love life in public, is all set to marry his long time girlfriend Geeta Basra. According to a leading daily, Harbhajan and Geeta want to take their relationship to the next level. The couple is planning to have a big fat wedding in September 2012. The marriage celebrations will start in Bollywood actress Geeta Basra's home town Yorkshire in England and it will conclude in Harbhajan's village, which is in Punjab.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X