కళ్యాణరామ్...'హరే రామ్'....

By Staff

Kalyanram
మదర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా రూపొందుతున్న హరేరామ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. కల్యాణ్‌రామ్ సొంత బానర్ యన్‌టిఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావు అలియాస్ హర్షవర్ధన్ దర్శకుడు. కల్యాణ్‌రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా లో ప్రియమణి హీరోయిన్ కాగా హీరో తల్లిగా సీత నటించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి.

ఇక ఈ సినిమా విజయంపై కళ్యాణ్ రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ "మా సంస్థ నుంచి వచ్చిన 'అతనొక్కడే' ని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదు. ఆ సినిమాకు మించిన వినోదాన్ని అందించే ఈ సినిమా అంతకంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకి కథ, కథనాలు బలాలు. నాకూ, నా తల్లిగా నటించిన సీతకూ మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ మెప్పిస్తాయి. నా పాత్ర యువతనీ, మహిళల్నీ కూడా ఆకట్టుకుంటుంది" అని కల్యాణ్‌రామ్ తెలిపాడు.

ఈ నెలలో ఆడియోనీ, జూలైలో సినిమానీ విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాసిన ఈ సినిమాకు సి. రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి 'హ్యాపీడేస్' ఫేమ్ మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X