పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం.. సీఎం రేవంత్ రెడ్డితో నిర్మాత భేటీ
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కోసం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హరి హర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్నోవాయిదాల తర్వాత, ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత ఏఎం రత్నం మర్యాద పూర్వకంగా కలవడం ఆసక్తికరంగా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్..
పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి రెండు ఏళ్లు కావస్తోంది. చివరిగా 'బ్రో' చిత్రంతో అలరించారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్ లో బిజీ అయ్యి జనసేన పార్టీ తో బరిలోకి దిగి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల తను సైన్ చేసిన సినిమాలకు సంబంధించిన పెండింగ్ షూట్ ను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' చిత్రానికి సంబంధించిన షూట్, డబ్బింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 12న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

సీఎంను కలిసిన ఏఎం రత్నం..
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం రూపొందించారు. చిత్రం విడుదల సందర్భంగా ఏఎం రత్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. సినిమా గురించి సీఎంకు వివరించారు. 17వ శతాబ్దపు చారిత్రాత్మకమైన చిత్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. అలాగే టికెట్ ధరలను పెంచడంపైనా రేవంత్ రెడ్డికి తెలియజేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ సినిమా పట్ల సానుకూలంగా స్పందించినట్టు తాజాగా మేకర్స్ తెలిపారు. అయితే సినిమా కోసం అనుకున్న దానికంటే డబుల్ బడ్జెట్ వెచ్చించిన సందర్భంగా ప్రభుత్వ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు గురించి..
హరిహర వీరమల్లు చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన తప్పుకున్నారు. నెక్ట్స్ ఏఎం జ్యోతి కృష్ణ బాధ్యతలు చూశారు. ప్రస్తుతం మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా అలరించబోతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.
పవన్ కళ్యాణ్ లైనప్ లోని నెక్ట్స్ చిత్రాలివే..
ప్రస్తుతం మూడు చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. జూన్ 12న హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు : పార్ట్ 1' విడుదల కాబోతుండగా.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఆ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని కంప్లీట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











