Pawan Kalyan: 900 మందితో జోరుగా హరిహర వీరమల్లు షూటింగ్.. మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఖుషి నిర్మాత ఏం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఇక లేటెస్ట్ గా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే ఇచ్చారు. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అయితే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమా కోసం ప్రతి రోజు వందలాదిమంది టెక్నీషియన్స్ తో పాటు నటీనటులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు దాదాపు 900 నటీనటులు సిబ్బందితో కలిసి ఈ సినిమా షూటింగ్ను రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Hari hara veera mallu movie shooting latest update and pics viral

గత అక్టోబర్ నెల నుంచి కూడా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది అని వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ పూర్తి చేయబోతున్నట్లుగా కూడా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది అని తప్పకుండా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని వారు సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇక టాక్ ప్రకారమైతే ఈ సినిమా 17వ శతాబ్దంలోని ఒక ఆసక్తికరమైన ఘట్టం మీద కొనసాగుతుందట.

Hari hara veera mallu movie shooting latest update and pics viral

ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో ఆకట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇక మేయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా ప్రతి నాయకుడిగా మొగల్ చక్రవర్తి రాజుగా బాలీవుడ్ ప్రముఖు నటుడు బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. అలాగే మరి కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X