భోరున విలపించిన ఎన్టీఆర్.. చంద్రబాబు, లోకేష్ పరామర్శ
Recommended Video

సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త అందర్నీ విషాదంలోకి నెట్టింది. ప్రమాద వార్తను తెలుసుకొన్న వెంటనే ఆయన కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రాం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని తరలింపు ఏర్పాట్లలో మునిగిపోయారు.

ఘటనాస్థలానికి చంద్రబాబు, లోకేష్
హరికృష్ణ మృతి వార్త తెలియగానే ఏపీ సీఎం నారా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదానికి కారణాలను వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

చంద్రబాబు పరామర్శ
తండ్రి మరణవార్తతో దు:ఖంలో మునిగిన ఎన్టీఆర్, కల్యాణ్‌రాంను చంద్రబాబు, లోకేష్ పరామర్శించారు. ధైర్యాన్ని కోల్పోవద్దని వారికి సూచించారు.

భోరున విలపించిన ఎన్టీఆర్
నారా లోకేష్ పరామర్శించే సమయంలో ఎన్టీఆర్ భోరున విలపించడం అందర్ని కలిచి వేసింది. కల్యాణ్ రాం పరిస్థితి ఇంకా చెప్పలేకుండా ఉంది. హరికృష్ణ భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తరలించారు.

అధికారిక లాంఛనాలతో
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు.


Click it and Unblock the Notifications











