»   »  నిషా కొఠారి కి ఈ సారైనా...

నిషా కొఠారి కి ఈ సారైనా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nisha Kothari
రామ్ గోపాల్ వర్మ ఆవిష్కిరించిన నిషా కొఠారి పాపం పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది. అప్పటికీ స్కిన్ షో ని నమ్ముకున్న ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా బాలీవుడ్ లోనూ ఆఫర్స్ లేకుండా మిగిలిపోయింది. అటు వర్మ వదిలేసి, ఇటు సినిమాలు లేక కొట్టుమిట్టాడుతున్న ఈ ముద్దు గుమ్మ తెలుగులో బాలయ్య ప్రక్కన 'ఒక్క మగాడు' ని రెచ్చకొడుతూ అందాలు ఆరబోసింది. అయినా ఫలితం శూన్యం . ఒక్క ప్రొడక్షన్ కంపెనీ నుంచీ మంచి ఆఫర్ రాలేదు . ఈ లోగా ఆమెకు 'హరి ఓం' అనే సినిమాలో ఓ శేఖర్ కొత్త హీరో ప్రక్కన ఆఫర్ వచ్చింది .

మారు మాట్లాడకుండా ఒప్పుకున్న ఈమె ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతోంది. రివెంజ్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకూ దర్శకుడూ కొత్త వాడే. మరి ఆమెను మరింతగా ఎక్స్ ఫోజ్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అయినా గత చిత్రాలలో ఆమె యేమన్నా మడి కట్టుకుని కూర్చుందా ఫెయిలయ్యాయి ఆ చిత్రాలు అనటానికి అని సీనియర్లు నవ్వుకుంటున్నారు. మరి ఈ సారన్నా ఆమె ప్రయత్నం ఫలించి ఆఫర్ల కుంభ వృష్టి కురిస్తే బాగుంటుంది.

లేకపోతే ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా చేస్తున్న మధు శర్మలా పరిస్ధితి తయారవుతుంది. ఫేడవుట్ అయ్యి ఆ సినిమా ...ఈ సినిమా అని లేకుండా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయినా అందాలు ఆరబోతే నటన అని ఫీలయితే ...ఇలాగే ఉంటుంది. నటన కూడా కాస్త నేర్చుకుంటే ఆమె కోరికా తీరుతుంది...మనకీ కాస్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే డ్రామాలా ఉంటుంది...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X