టెమ్ట్ అయ్యి ఆమెను బుక్ చేసిన బెల్లంకొండ
నిర్మాత బెల్లంకొండ సురేష్ కి ఏదైనా తనను ఇంప్రెస్ చేస్తే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకోవటం అలవాటు. అది డబ్బింగ్ సినిమా కావచ్చు, రీమేక్ కావచ్చు..లేదా కొత్త డైరక్టర్ కావచ్చు..అదే రూటులో ఇప్పుడు ఆయన కంట్లో పడి నచ్చిన హీరో ఐటమ్ అవటం కావటం గ్యారెంటీ అని మరీ చెప్తున్నాడట. ఇక బెల్లంకొండ ఆమెకు అడ్వాన్స్ ఇచ్చాడు అని తెలియగానే మరికొంత మంది నిర్మాతల కళ్ళు ఆమె పై పడ్డాయిట. ఇక ఆమె భూమిక నిర్మించిన తకిట ..తకిట చిత్రం తో పరిచయమైంది. ఇక పిల్ల జమీందారు విషయానికి వస్తే..."అలా మొదలైంది తర్వాత నాని నటించి విడుదలవుతున్న తెలుగు సినిమా 'పిల్ల జమీందార్'. సినిమా ఆద్యంతం తాజాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ తమ గతం తప్పకుండా గుర్తుకొస్తుంది. మంచి సన్నివేశాలతో ముచ్చట కలిగించే సినిమా అవుతుంది.
ఈ దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చిత్ర నిర్మాత డి.ఎస్.రావు పేర్కొన్నారు. "తన మనవడు సుఖంగా జీవించాలన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జమీందారు కొన్ని ఆంక్షలు పెడతాడు. వాటి వల్ల భవిష్యత్తులో మనవడు భోగభాగ్యాలు అనుభవిస్తాడన్నది అతని దూరదృష్టి. కానీ అవే నానికి ఇబ్బంది కలిగిస్తాయి. అసలు ఆ ఇక్కట్లు ఏమిటి? ఎందుకు? అనేది ఆసక్తికరం. కాలేజీ విద్యార్థుల్లాగా నాని, హరిప్రియ, మరో నాయిక బిందుమాధవి, వాచ్‌మెన్‌గా రావురమేష్, తెలుగు మాస్టార్‌గా ఎమ్మెస్ నారాయణ మెప్పిస్తారు. తాత పాత్రలో నాగినీడు, లాయర్‌గా శివప్రసాద్ పాత్రలు ఆకట్టుకుంటాయి.''


Click it and Unblock the Notifications











