పిటపిటలాడుతూ పిచ్చెక్కిస్తున్న హరిప్రియ!
తకిట తకిట, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ హరిప్రియ....ఇక్కడి ప్రక్షకులను పెద్గగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ సినిమాలు యావరేజ్ గా ఆడటంతో పాటు, హరిప్రియ నటనలో గానీ, అందంలో గానీ చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేక పోవడమే ఇందుకు కారణం. ఇట్లా అయితే సినీ పరిశ్రమలో కష్టం అని గ్రహించిందో? ఏమో? గానీ.......ఈ సారి పిట పిటలాడే అందాలతో, సెక్సీ ఆటిట్యూడ్ తో కుర్రకారుకు పిచ్చెక్కించాలని నిర్ణయించుకున్నట్లుంది. పక్క ఫోటో చూశారుగా ఎలా ఉందో? భయం, బెరుకు, మొహమాటం లేకుండా అందాలను, సెక్సీనెస్ సెస్ ను ఎలా ప్రదర్శిస్తుందో...ఫోటోనే ఇలా ఉందంటే...సినిమాలో ఇంకెలా ఉంటుందో ఈభామ.
'స్వామి మణికంఠ' పేరుతో రూపొందుతున్న సినిమాను గాను హరిప్రియ ఈ హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగులోనూ విడుదలకాబోతోంది. విజేష్ మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మను రమేషన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా లక్ష్మి శర్మ, కౌశిక్ బాబు, కళాభవన్ మణి తదితరులు నటిస్తున్నారు.
మరి ఈ దెబ్బతో హరిప్రియ సౌతిండియా టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందా? లేక సెక్స్ బాంబ్ ఇమేజ్ తో అందుకు తగిన పాత్రలకే పరిమితం అవుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











