Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు వరకు పవన్ కల్యాణ్ షూటింగ్ కంప్లీట్..
Hari Hara Veera Mallu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీకి దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ 'హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆ కేజ్రీ అప్డేట్ ఏంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో రాబోతోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. మూవీ ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్ ఓ కత్తిని గాల్లోకి దూస్తూ కనిపిస్తారు. ఈ కొత్త పోస్టర్ లో క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది. వాస్తవానికి ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో మిగిత సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, నాజర్, కమెడియన్ సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప పి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. గతంతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నాడు చూడని యాక్షన్ మూవెంట్స్, ఫైట్ సీన్స్ తెరకెక్కించేందుకు దర్శకుడు జ్యోతి కృష్ణ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయ్యింది. అయితే.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీ కావడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మళ్లీ తన పెండింగ్ సినిమాలపై దృష్టి సారించాడు. ఇటీవలే మంగళగిరి లోనే ఈ సినిమా కోసం సెట్ ను ఏర్పాటు చేశారు. యాక్షన్ సీన్స్ అక్కడే షూట్ చేయబోతున్నారంట.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని వచ్చే ఏడాది 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ సాలిడ్ న్యూస్ వచ్చేసింది. కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు మళ్లీ తన పెండింగ్ సినిమాలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్టోబర్ 21 నుంచి 24 వరకు పవన్ తిరిగి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. దసరా కానుకగా హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి పాట రాబోతుందని సమాచారం. కీరవాణి అద్భుతమైన సంగీతంలో అదిరిపోయే సాంగ్ వస్తుందనీ, త్వరలోనే హరిహరవీరమల్లు మొదటి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. నిజంగా ఈ అప్డేట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పుల్ జోష్ నిలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











