తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

టాలీవుడ్ స్టార్ జూ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి కృష్ణా నదిలో తన తండ్రి హరికృష్ణ హస్తికలను నిమజ్జనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద గల కృష్ణా తీరంలో వేదపండితుల సంక్షమంలో ఈ తంతు నిర్వహించారు.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చిన విషయం తెలియగానే ఆ ప్రాంతానికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అయితే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పోలీసుగు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విషాదంలో ఉన్న ఇద్దరు స్టార్స్... అభిమానులను కలవకుండానే వెనుదిరిగారు.

Harikrishna Ashes Immersed in Krishna River

సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. హరి మరణం అభిమానులతో పాటు, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

అరవింద సమేత షూటింగ్ మధ్యలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. చిత్ర యూనిట్ ఆ సమయంలో సినిమా షూటింగ్ కొంతకాలం వాయిదా వేయాలని ప్రయత్నించారు. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని, తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదు రోజులకే అరవింద సమేత షూటింగ్‌లో పాల్గొన్నాడు ఎన్టీఆర్‌.

ఆ తర్వాత జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ దుఃఖంతో మాట్లాడాడు. ఈ సంగటన వల్ల సినిమా అనుకున్న తేదీకి రిలీజ్‌ కాదేమో? అనుకున్నారు. కాని వృత్తి ధర్మం ఎప్పుడు మరిచిపోకూడదని మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు. మా నాన్న హరికృష్ణ గారు మాకు అదే చెప్పారు. రేపటి రోజున మా పిల్లలుకు కూడా మేం ఇదే నేర్పిస్తామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X