ఆ సినిమా బాగాలేదని అర్జెంటుగా ఎన్టీఆర్‌ను రీ-లాంచ్ చేయమన్నారట!
Recommended Video

తెలుగు సినిమా పరిశ్రమలో వైజయంతి మూవీస్ బేనర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో ఒకప్పుడు ఈ సంస్థకు మరెవరూ సాటిరారు అనే రేంజిలో తన హవా కొనసాగించింది. అదే సమయంలో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లను ఇండస్ట్రీకికి పరిచయం చేసిన ఘటన కూడా సొంతం చేసుకుంది. ఇదొక సెంటిమెంటుగా మారడంతో ఇండస్ట్రీలోని బిగ్ ఫ్యామిలీస్ తమ వారసులను ఈ బేనర్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపేవారు. జూ ఎన్టీఆర్‌కు కూడా తొలి సినిమా కలిసి రాక పోవడంతో వైజయంతి మూవీస్ బేనర్లో రీ లాంచ్ చేయమని హరికృష్ణ అడిగారట.

హరికృష్ణ స్వయంగా వచ్చి అడిగారు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ మాట్లాడుతూ.... ఓసారి హరికృష్ణ తర వద్దకు వచ్చి తారక్.... రామోజీరావు బేనర్లో చేసిన సినిమా అంతబాగోలేదు, అర్జెంటుగా తారక్‌తో నువ్వొక సినిమా తీసి మా వాడిని రీ లాంచ్ చేయాలి అన్నారు. లక్కీగా ‘స్టూడెంట్ నెం.1' లాంటి మంచి కథ దొరకడం, రాజమౌళి లాంటి మంచి టెక్నీషియన్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.' అన్నారు.

చిరంజీవి కూడా ..
చిరంజీవి కూడా తన కుమారుడు రామ్ చరణ్‌ను మా బేనర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయమని అడిగారు. వారికి అరవింద్, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లు ఉన్నా నా వద్దకు వచ్చి అడిగారు. దీంతో పూరి జగన్నాధ్‌తో చిరుత చేశాం... అని అశ్వినీదత్ గుర్తు చేసుకున్నారు.

గౌరవంగా భావించాం
ఈ రోజుల్లో కృష్ణగారి పద్మాలయకు మంచి పేరుంది. ఎన్నో గొప్ప, భారీ సినిమాలు తీశారు. వాళ్లు మహేష్‌ను ఇంట్రడ్యూస్ చేయకుండా నన్ను ఇంట్రడ్యూస్ చేయాలని అడగటం, తర్వాత చిరంజీవిగారు అడగటం చాలా గౌరవంగా భావించాము అని అశ్వినీదత్ గుర్తు చేసుకున్నారు.

బన్నీని కూడా చేస్తే బావుంటుందనిపించింది
తర్వాత బన్నీని కూడా ఇంట్రబ్యూస్ చేస్తే బావుంటుందని నేను, రాఘవేంద్రరావుగారు అనుకుని అరవింద్ ను అడిగితే ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలా ‘గంగోత్రి' వచ్చింది. తర్వాత చంద్రబాబు కూడా నారా రోహిత్ ఇంట్రస్టుగా ఉన్నాడు అని అడగటంతో అతడితో సినిమా చేశాం. దానికి మంచి అవార్డులు, పేరు వచ్చింది అన్నారు.


Click it and Unblock the Notifications











