బాలయ్య 'సింహా' సెంచరీకి కేక్ కట్ చేసిన సీతయ్య ..!?
ఒకవైపే చూడూ...రెండో వైపు చూడాలని ప్రయత్నించకూ..మాడిపోతావ్ అంటూ 'సింహా'లో పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి ఇటీవలే అర్థశతదినోత్సవం పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 'సింహా" చిత్రం శతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. అలాగే సింహా విజయోత్సవ యాత్ర ద్వారా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించిందని ఈ వేడుక సందర్భంగా బాలయ్య తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదిలావుంటే సింహా 100డేస్ సూపర్ సక్సెస్ అయినందుకు తెలుగుదేశం నాయకుడు, నందమూరి బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ కేక్ కట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. భవిష్యత్‌లో మా బాలయ్య ఇలాంటి చిత్రాలను మరెన్నో తీయాలని మనసారా కోరుకుంటున్నానని హరికృష్ణ తన ఆకాంక్షను తెలిపారు.
బాలకృష్ణ సింహా హరికృష్ణ నయనతార నమిత స్నేహా ఉల్లాల్ పరమవీర చక్ర balakrishna simha harikrishna nayantara namitha sneha ullal parama veera chakra


Click it and Unblock the Notifications