ఎన్టీఆర్ ఎదురించాడు.. హరికృష్ణ తలవంచాడు!.. కలిసిరాని ఆ నెంబర్!

By Rajababu

Recommended Video

నందమూరి కుటుంబాన్ని బెదిరిస్తున్న 9 అంకె

నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడటం అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను తీవ్రంగా కలవరపెడుతున్నది. నందమూరి జానకి రాం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ 2014 డిసెంబర్ 6వ తేదీన నల్గొండలోని ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో జానకిరాం మృత్యువాత పడ్డారు. తాజాగా హరికృష్ణను మృత్యువు వెంటాడింది.

తృటిలో తప్పించుకొన్న ఎన్టీఆర్

తృటిలో తప్పించుకొన్న ఎన్టీఆర్

2009 అసెంబ్లీ ప్రచారానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ నల్లగొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఆ ప్రమాదంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడటం జరిగింది. దాదాపు మరణం అంచునకెళ్లి తిరిగి వచ్చాడు. ఆ ప్రమాదంలో మృత్యువును ఎదురించి బతికి బయటపడ్డారు.

తుదిశ్వాస విడిచిన హరికృష్ణ

తుదిశ్వాస విడిచిన హరికృష్ణ

తాజాగా నెల్లూరులో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనలో హరికృష్ణ మృత్యువును జయించలేకపోయారు.

ముగ్గురు డ్రైవర్ సీట్‌లోనే

ముగ్గురు డ్రైవర్ సీట్‌లోనే

నందమూరి ఫ్యామిలీలో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదాల సమయంలో ఎన్టీఆర్, జానకిరాం, హరికృష్ణ వాహనం నడుపుతూ డ్రైవర్ సీట్లో ఉండటం గమనార్హం. మితిమీరిన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అప్పట్లో ఎన్టీఆర్‌పై కేసు నమోదైంది. కాకపోతే సీటు బెల్ట్ కట్టుకోవడంతో ఆయన బతికి బయటపడ్డారు. తాజాగా హరికృష్ణ కూడా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు.

కలిసిరాని 9 అంకె

కలిసిరాని 9 అంకె

ఎన్టీఆర్ ఫ్యామిలీకి లక్కీ నంబర్ 9. ఆ సంఖ్యను చాలా ఇష్టపడుతారు. కానీ గత రెండు సందర్భాల్లో 9 అంకె వారికి సపోర్టుగా నిలువలేకపోయింది. ఎన్టీఆర్, జానకీరాం, హరికృష్ణ గురైన ప్రమాదంలో జాతీయ రహదారి 9పైనే జరిగింది. ఎన్టీఆర్ ఒక్కరే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X